Home > NEWS > Andhra Pradesh > వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి
రూ.70 వరకు పెంచుకుంటామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కోరగా, ఏపీ సర్కారు రూ.45 వరకు పెంచుకోవచ్చని స్పష్టం చేసింది.
BY Telugu Global10 Jan 2023 11:05 PM IST

X
Telugu Global Updated On: 11 Jan 2023 12:12 AM IST
సంక్రాంతి సీజన్ లో పోటీలో దిగుతున్న చిరంజీవి హీరోగా వస్తున్న వాల్తేరు వీరయ్య మూవీ, బాలకృష్ణ హీరోగా వస్తున్న వీర సింహా రెడ్డి మూవీలకు టిక్కట్ రేట్లను పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. . టికెట్ ధరలపై గరిష్ఠంగా రూ.45 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే ధర పెంపుపై జీఎస్టీ అదనం. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
రూ.70 వరకు పెంచుకుంటామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కోరగా, ఏపీ సర్కారు రూ.45 వరకు పెంచుకోవచ్చని స్పష్టం చేసింది.
చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య జనవరి 13న, బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
Next Story