Home > NEWS > Andhra Pradesh > విభజన నేపథ్యంలో ఆస్తుల విభజన సరిగా జరగలేదని ఏపీ ప్రభుత్వం పిటిషన్ - సుప్రీంలో విచారణ
HomeNEWS Andhra Pradesh విభజన నేపథ్యంలో ఆస్తుల విభజన సరిగా జరగలేదని ఏపీ ప్రభుత్వం పిటిషన్ - సుప్రీంలో విచారణ
విభజన నేపథ్యంలో ఆస్తుల విభజన సరిగా జరగలేదని ఏపీ ప్రభుత్వం పిటిషన్ - సుప్రీంలో విచారణ
ఆస్తుల విభజన సరిగా జరగక ఆర్థికంగా నష్టపోయామంటూ ఏపీ తన పిటిషన్ లో పేర్కొంది. ఆస్తుల విభజన న్యాయబద్ధంగా జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది.
BY Telugu Global9 Jan 2023 10:16 AM
X
Telugu Global Updated On: 9 Jan 2023 10:35 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో ఆస్తుల పంపకాలు సరైన రీతిలో జరగలేదని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన లో ఆలస్యం జరిగిందని, ఆ రెండు షేడ్యూళ్ళలో ఉన్న ఆస్తుల్లో 91 శాతం తెలంగాణలోనే ఉన్నాయని ఏపీ ఆరోపించింది.
ఆస్తుల విభజన సరిగా జరగక ఆర్థికంగా నష్టపోయామంటూ ఏపీ తన పిటిషన్ లో పేర్కొంది. ఆస్తుల విభజన న్యాయబద్ధంగా జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది.
అయితే నేటి విచారణకు తెలంగాణ తరపున, కేంద్రం తరపున న్యాయవాదులు హాజరుకాకపోవడంతో కోర్టు విచారణను ఆరువారాలు వాయిదా వేసింది. ఈ లోపు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ పై రిజాయిండర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Next Story