Telugu Global
Andhra Pradesh

పదిలో ఇక ఆరు పేపర్లే.. ఏపీలో కొత్త ప్రయోగం..

ఇప్పుడు హిందీలాగే అన్ని సబ్జెక్ట్ లకు 100 మార్కులకు ఒకటే పేపర్ అనే విధానం తెస్తోంది. అంటే ఆరు సబ్జెక్ట్ లు, ఆరు పేపర్లు, ఆరు పరీక్షలు.. ఇదే కొత్త విధానం. 2022-23 విద్యా సంవత్సరం నుండి ఈ కొత్త పరీక్షా విధానాన్ని అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది.

పదిలో ఇక ఆరు పేపర్లే.. ఏపీలో కొత్త ప్రయోగం..
X

ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షా విధానాల్లో సరికొత్త మార్పు చేస్తోంది. ఇప్పటి వరకూ టెన్త్ క్లాస్‌లో 11 పేపర్లు ఉండగా వాటి సంఖ్యను 6కి కుదించబోతోంది. తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్.. సబ్జెక్ట్ లకు 50 మార్కులకు రెండేసి పేపర్లు, హిందీకి మాత్రం 100 మార్కులకు ఒకటే పేపర్ ఇప్పటి వరకూ ఉండేవి. ఇప్పుడు హిందీలాగే అన్ని సబ్జెక్ట్ లకు 100 మార్కులకు ఒకటే పేపర్ అనే విధానం తెస్తోంది. అంటే ఆరు సబ్జెక్ట్ లు, ఆరు పేపర్లు, ఆరు పరీక్షలు.. ఇదే కొత్త విధానం. 2022-23 విద్యా సంవత్సరం నుండి ఈ కొత్త పరీక్షా విధానాన్ని అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది.

సీబీఎస్ఈ మోడల్ ఆధారంగా..

ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో సెకండరీ స్కూల్ సర్టిఫికెట్(SSC) సిలబస్ ఉండేది. సెంట్రల్ స్కూల్స్ లో సీబీఎస్ఈ సిలబస్ ఉండేది. ఇప్పుడు SSC స్థానంలో CBSE సిలబస్‌ని క్రమక్రమంగా మార్పు చేస్తోంది. ఇంగ్లిష్ మీడియంను కూడా ప్రవేశపెడుతోంది. CBSE ప్రకారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో కూడా అదే సిలబస్, అలాగే పేపర్ల నిర్వహణ ఉంటుంది.

సక్సెస్ అవుతుందా..?

ఇటీవల కరోనా తర్వాత తొలిసారిగా టెన్త్ పరీక్షలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లు పెట్టింది. అయితే ఫలితాలు మాత్రం దారుణంగా వచ్చాయి. ఆరు పేపర్ల ప్రయోగం సక్సెస్ కాలేదనే ఆరోపణలు వినిపించాయి. దీంతో వెంటనే సప్లిమెంటరీ పరీక్షలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం కంపార్ట్ మెంటల్ పాస్ అనే పదాన్ని చేర్చబోమని స్పష్టం చేసింది. ఇప్పుడు శాశ్వతంగా ఆరు పేపర్లు పెట్టాలని నిర్ణయించింది. సుదీర్ఘ కసరత్తు చేసిన అనంతరం 6 పేప‌ర్ల ప‌రీక్షా విధానానికి ఏపీ విద్యాశాఖ ఆమోద ముద్ర వేసింది.

First Published:  22 Aug 2022 9:20 PM IST
Next Story