Telugu Global
Andhra Pradesh

గ్రామ సచివాలయ ఉద్యోగులకూ దిన పత్రిక

వలంటీర్లు పత్రిక కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నెలకు 5.22 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం నాలుగు నెలలకు గాను 7. 89కోట్ల రూపాయలను కేటాయించారు.

గ్రామ సచివాలయ ఉద్యోగులకూ దిన పత్రిక
X

ఏపీ వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకూ దిన పత్రిక అందజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే వలంటీర్లకు పత్రిక కొనుగోలు కోసం నెలకు 200 ఇస్తోంది. వారితో కేవలం సాక్షి పత్రికను మాత్రమే కొనుగోలు చేయిస్తున్నారన్న విమర్శ ప్రతిపక్షం నుంచి ఉంది.

ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకే వలంటీర్ల చేత పత్రిక కొనుగోలు చేయిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షా 26వేల మంది సచివాలయ ఉద్యోగులకూ దిన పత్రిక కొనుగోలు కోసం ఒక్కొక్కరికి రూ.200 కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఫ‌లానా పత్రికే కొనాలని మాత్రం ఎక్కడా చెప్పలేదు. అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న పత్రికను కొనుగోలు చేయాలని సూచించింది.

వలంటీర్లు పత్రిక కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నెలకు 5.22 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం నాలుగు నెలలకు గాను 7. 89కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రభుత్వ నిర్ణయంతో సాక్షి పత్రిక సర్వ్యూలేషన్ భారీగా పెరుగుతోంది.

First Published:  10 Dec 2022 8:09 AM IST
Next Story