ఏపీ అంటే అమరావతి మాత్రమేనా? ఎల్లో మీడియా ఏడుపు
దేశంలో 8 కొత్త నగరాలను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిచింది. ఇందులో ఒక నగరాన్ని నిర్మిచుకునే అవకాశం ఏపీకి కూడా ఇచ్చింది. అందుకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలోని కొప్పర్తిని మహానగరంగా తీర్చిదిద్దేంకు సాయం చేయాలని ప్రతిపాదనలు పంపింది.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎల్లో మీడియా ఏడుపు రోజురోజుకు ఎక్కువైపోతోంది. తాజాగా ‘అవకాశం వచ్చినా అమరావతి కనబడదా’ అనే హెడ్డింగ్‌తో పెద్ద స్టోరీ రాసింది. దేశంలో కొత్త నగరాలను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిచింది. మొత్తం 8 నగరాలను నిర్మించేందుకు కేంద్ర రెడీ అయ్యింది. ఇందులో ఒక నగరాన్ని నిర్మిచుకునే అవకాశం ఏపీకి కూడా ఇచ్చింది. కాబట్టి ఏదైనా నగరాన్ని ఏర్పాటు చేసుకునే ప్రతిపాదనను పంపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది.
అందుకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలోని కొప్పర్తిని మహానగరంగా తీర్చిదిద్దేంకు సాయం చేయాలని ప్రతిపాదనలు పంపింది. మహానగరానికి కావాల్సిన అన్నీ సదుపాయాలు, అవకాశాలు ఉన్న అమరావతిని వదిలేసి కడప జిల్లాలోని కొప్పర్తి పేరు ప్రతిపాదించటం ఏమిటనేది ఎల్లో మీడియా అభ్యంతరం. అసలు ఎల్లో మీడియా చెప్పినట్లుగా అమరావతికి మహానగరం అయ్యే అవకాశాలు ఎక్కడున్నాయో అర్థంకావటంలేదు. అమరావతిని మహానగరంగా చేసుకునే అవకాశాన్ని చంద్రబాబు నాయుడే తనంతట తాను చెడగొట్టుకున్నారు.
నిజానికి ఆకాశానికి నిచ్చెనలేసి, అమరావతిని గ్రాఫిక్స్ లో చూపంచి తాను మునగటమే కాకుండా జనాలను కూడా భ్రమల్లో ముంచేశారు. దాని ఫలితమే 2019లో ఘోర ఓటమి. దాన్ని జగన్ అవకాశంగా తీసుకుని మూడు రాజధానుల కాన్సెప్టు తీసుకొచ్చారు. జగన్ ఇంత స్పష్టంగా అమరావతిని పక్కనపెట్టేసిన తర్వాత ఇంకా అమరావతిని ఎందుకు డెవలప్ చేస్తారు? అసలు చేయటానికి అమరావతిలో ఏముంది? అని కదా మంత్రుల ప్రశ్న.
అందుకనే కడపకు దగ్గరలో ఉన్న గ్రామీణ ప్రాంతమైన కొప్పర్తిని మహానగరంగా డెవలప్ చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే కొప్పర్తిని పారిశ్రామిక జోన్‌గా ప్రభుత్వం డెవలప్ చేస్తోంది. అవసరమైన భూసేకరణ జరిపి మహానగరంగా డెవలప్ చేస్తుంది. ఎలాగూ ఆర్థికపరమైన సాయమంతా కేంద్రానిదే కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రాయలసీమ బాగా వెనకబడున్న ప్రాంతమని అందరికీ తెలిసిందే. కొప్పర్తి గనుక మహానగరంగా డెవలప్ అయితే అటు చిత్తూరు, ఇటు కర్నూలులో కూడా ఎంతో కొంత డెవలప్ అయ్యే అవకాశముంది. కొప్పర్తిని రూ.వెయ్యి కోట్లతో డెవలప్ చేస్తున్నారన్న మాటనే ఎల్లో మీడియా జీర్ణించుకోలేకపోతోందని అర్థమవుతోంది.