ఇంటి స్థలాలు అడిగిన జర్నలిస్ట్‌లకు సజ్జల క్లాస్
ఇంతకు ముందు చంద్రబాబునాయుడు ఇచ్చినాడా? . ముందు అది అడుగు!. సర్.. చంద్రబాబునాయుడు ఇవ్వలేదు.. మీరైనా ఇవ్వండి సర్ అని అడుగు. నువ్వు అలా అడగలేదు.
ఏపీలో జర్నలిస్ట్‌ల విషయంలో జగన్ ప్రభుత్వం ఏమంతా సానుకూలంగా లేదన్న అభిప్రాయం ఉంది. అక్రిడేషన్ల విషయంలోనూ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా అమరావతిలో పేదల ఇళ్ల స్థలాలను పరిశీలించేందుకు వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డిని కొందరు జర్నలిస్టులు తమకూ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందిగా కోరారు. ఒక జర్నలిస్ట్ ఈ టర్మ్‌లోనైనా ఇళ్ల స్థలాలు ఇస్తారా అని ప్రశ్నించారు. దాంతో సదరు జర్నలిస్ట్‌కు సజ్జల సుతిమెత్తగా క్లాస్ తీసుకున్నారు.
''ఇంతకు ముందు చంద్రబాబునాయుడు ఇచ్చినాడా? . ముందు అది అడుగు!. సర్.. చంద్రబాబునాయుడు ఇవ్వలేదు.. మీరైనా ఇవ్వండి సర్ అని అడుగు. నువ్వు అలా అడగలేదు. ఈ టర్మ్‌లోనైనా ఇస్తారా అంటున్నావ్. మేం వచ్చిందే ఫస్ట్ టర్మ్. నాలుగేళ్లలో రెండేళ్లు కోవిడ్‌తో పోయింది. ఇంతమందికి ఇస్తున్నప్పుడు మిమ్మల్ని ఎందుకు వదిలేస్తాంలే గానీ.. మీరు అడిగిన పద్దతి బాగలేదు. జర్నలిస్టులేమీ పేదలు కాదు. పేదలై ఉంటే ఈ పాటికే వచ్చేవి. జర్నలిస్ట్ సెక్షన్ వేరే. ప్రజలకు సంబంధించిన ఇళ్ల స్థలాల సందర్భంగా వచ్చి అడితే ఎలా చెప్పు?. జర్నలిస్ట్‌వి జర్నలిస్ట్‌గా అడిగితే వేరేగా బాగుంటుంది'' అని సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు.