Telugu Global
Andhra Pradesh

చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయకూడదు..?

ఐటీ నోటీసుల వ్యవహారం రాత్రికిరాత్రి జరిగింది కాదన్నారు స‌జ్జ‌ల‌. చాలా కాలంగా వ్యవహారం నడుస్తోందని, ఐటీ నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ సాంకేతిక కారణాలతో తప్పించుకుంటూ వస్తున్నారన్నారు.

చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయకూడదు..?
X

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చట్టానికి ఏమైనా అతీతుడా అని ప్రశ్నించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబును అరెస్ట్ చేస్తారా అన్న ప్రశ్నపై చంద్రబాబేమీ అతీతుడు కాదు కదా అని వ్యాఖ్యానించారు. అరెస్ట్‌పై తానే ముందు మాట్లాడితే అరెస్ట్‌ చేయకుండా వెనక్కు తగ్గుతారన్న ఉద్దేశం చంద్రబాబులో ఉండవచ్చన్నారు. చంద్రబాబు మాటలు బుకాయింపులో భాగమేనన్నారు.

ఐటీ నోటీసుల వ్యవహారం రాత్రికిరాత్రి జరిగింది కాదన్నారు స‌జ్జ‌ల‌. చాలా కాలంగా వ్యవహారం నడుస్తోందని, ఐటీ నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ సాంకేతిక కారణాలతో తప్పించుకుంటూ వస్తున్నారన్నారు. చివరకు ఆధారాలను ఐటీ బయటపెట్టిందన్నారు. వాట్సాప్‌ చాట్లు, మేసేజ్‌లు అన్నీ ఐటీ దగ్గర ఉన్నాయన్నారు. వీటి ఆధారంగానే ఐటీ నోటీసులు జారీ చేసిందన్నారు. దానికి సమాధానం చెప్పకుండా తనది దశాబ్దాల పాతివ్రత్యం అంటూ తప్పించుకోవడం సాధ్యం కాదన్నారు. చంద్రబాబు చేసిన నేరం ఆధారాలతో సహా నిరూపితమైందన్నారు.

వారం రోజులుగా ఈ అంశంపై టీడీపీ వాళ్లు అస్సలు రియాక్ట్ కావడం లేదని, ఇప్పుడు అరెస్ట్ చేస్తారేమో అంటున్నారని, అరెస్ట్ చేయకుండా ఉండేందుకు చంద్రబాబు ఏమైనా అతీతుడా అని ప్రశ్నించారు. దోషిగా తేలిన తర్వాత శిక్ష కూడా పడుతుందన్నారు. ఆయనకు ఆయన అబోవ్ ఆల్‌ అనుకుంటే కుదరదన్నారు. చంద్రబాబు నిప్పు కాదని ఒక తప్పు అని విమర్శించారు. దేశ చరిత్రలో ఒక నకిలీ ఎదుగుదల ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు మాత్రమేనన్నారు.

అమరావతి నిర్మాణాల్లో ఎస్‌ఎఫ్‌టీ 10వేలు అన్నప్పుడే అందరం అభ్యంతరం చెప్పామన్నారు. మూడు వేల పనికి 10వేలు చెల్లించారని.. దీని బట్టే క్లియర్‌గా దోపిడీ జ‌రిగింద‌ని అర్థమవుతోందన్నారు. చివరకు పేదల కోసం కట్టించిన టిడ్కో ఇళ్లలోనూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు.

*

First Published:  6 Sept 2023 12:08 PM GMT
Next Story