ఏపీలో గ్రూప్-1, గ్రూప్-2.. ఊరించి ఉసూరుమనిపించిన జగన్
త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు వెలువడతాయన్నది తెలిసిన విషయమే అయినా, ఈరోజు ఆర్థిక శాఖ పోస్ట్ ల ఖాళీలపై ఉత్తర్వులు జారీ చేయడంతో అది ఖాయమైంది. మొత్తం 597 పోస్టులు భర్తీ చేసేందుకు APPSCకి అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
వెయ్యి పోస్ట్ లు రెడీగా ఉన్నాయంటూ ఓవైపు ఊరించారు.
ఎన్నికల ఏడాదిలో భారీగా గ్రూప్-1, గ్రూప్-2 పోస్ట్ లు భర్తీ చేస్తారన్నారు.
డీఎస్సీ లేకపోయినా గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవ్వొచ్చంటూ ఊరించారు.
తీరా పోస్ట్ ల సంఖ్య వచ్చేసరికి 597 దగ్గర ఆగిపోయింది.
ఆర్థిక శాఖ ఉత్తర్వులు...
త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు వెలువడతాయన్నది తెలిసిన విషయమే అయినా, ఈరోజు ఆర్థిక శాఖ పోస్ట్ ల ఖాళీలపై ఉత్తర్వులు జారీ చేయడంతో అది ఖాయమైంది. మొత్తం 597 పోస్టులు భర్తీ చేసేందుకు APPSCకి అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో గ్రూప్-1 పోస్టులు 89 కాగా.. గ్రూప్-2లో 508 పోస్ట్ లు ఉన్నాయి.
గ్రూప్- 1 కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ కేటగిరీ-II, అసిస్టెంట్ కమిషనర్ (ST), అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులతో సహా పలు ఉద్యోగాలు భర్తీ చేస్తారు. గ్రూప్-2 కేటగిరీ కింద డిప్యూటీ తహశీల్దార్లు (గ్రేడ్ II), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ III, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ IIతో పాటు మరికొన్ని పోస్ట్ లు భర్తీ చేయాల్సి ఉంది. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు APPSC త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. రిజర్వేషన్ల వారీగా పోస్ట్ ల వివరాలపై నోటిఫికేషన్లోనే క్లారిటీ వస్తుంది.
అత్యథికంగా ఉన్న పోస్ట్ ల వివరాలు
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు -161
ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్లు -150
డిప్యూటీ తహశీల్దార్లు -114