Telugu Global
Andhra Pradesh

ఛానెల్ మారితే మీ కళ్లు మీరే నమ్మలేరు

ఏపీ రిజల్ట్ విషయంలో ఛానెల్ మారితే మన కళ్లు మనమే నమ్మలేనంతగా నెంబర్లు మారిపోతున్నాయి.

ఛానెల్ మారితే మీ కళ్లు మీరే నమ్మలేరు
X

కౌంటింగ్ మొదలైంది, ఆధిక్యాలు కనపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్డీఏ హవా స్పష్టంగా తెలుస్తోంది. ఏపీకి వచ్చేసరికి ఛానెల్ మార్చితే చాలు ఆధిక్యాలు మారిపోతున్నాయి. మీడియా ఇక్కడ స్పష్టంగా విభజన రేఖ గీసుకుంది. ఫలితాలపై ఎవరి వ్యాఖ్యానాలు వారివి, ఆధిక్యాలపై ఎవరి విశ్లేషణలు వారివి.

వైనాట్ 175. వైసీపీ అంచనా తప్పని స్పష్టంగా తేలిపోయింది. ఫలితాలు కూడా కూటమికే అనుకూలంగా ఉన్నాయని దాదాపుగా అన్ని మీడియా ఛానెళ్లు స్పష్టంగా చెబుతున్నాయి. కుప్పంలో చంద్రబాబు సేఫ్, మంగళగిరిలో లోకేష్ లీడ్ లో కొనసాగుతున్నారు, ఇక పిఠాపురంలో అయితే పవన్ కల్యాణ్ విజయం ఖాయమని తేలుతోంది. ఈ లెక్కలన్నీ వైసీపీకి పెద్దగా రుచించకపోవచ్చు. రెండు మూడు రౌండ్లకే ఫలితాలపై అంచనా వేయడం తప్పని, మిగతా రౌండ్లకోసం వేచి చూద్దామంటున్నారు ఆ పార్టీ నేతలు, అభిమానులు.

ఇక సాక్షి విషయానికొస్తే అక్కడ మాత్రం వైసీపీ ఆధిపత్యం చాలాసేపు కొనసాగింది. మూడో రౌండ్ దగ్గరకు వచ్చేసరికి కాస్త పరిస్థితి క్రమంగా మారింది. కూటమి లీడింగ్ ని సాక్షి కూడా చూపిస్తోంది. అయితే మిగతా ఛానెళ్లలో వస్తున్న నెంబర్లు వేరు, సాక్షిలో చూపిస్తున్న నెంబర్లు వేరు. మొత్తానికి ఏపీ రిజల్ట్ విషయంలో ఛానెల్ మారితే మన కళ్లు మనమే నమ్మలేనంతగా నెంబర్లు మారిపోతున్నాయి.

First Published:  4 Jun 2024 4:16 AM GMT
Next Story