జగన్ ఎన్నికల 'సారథులు' వీళ్ళేనా..?
అదే పద్దతిలో జగన్ ఇప్పుడు బూత్ కమిటీలు అని కాకుండా గృహసారథులు అని కొత్త పేరుపెట్టారంతే. చేయాల్సిన పనిమాత్రం ఒకటే. ఇన్ని లక్షల మందిని ఎందుకు నియమించబోతున్నారంటే రేపటి ఎన్నికల్లో వలంటీర్లు అందుబాటులో ఉండరు కాబట్టే.
వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి కొత్త కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఈ కొత్త కాన్సెప్ట్ పార్టీ పరమైనది. తొందరలోనే 5.20 లక్షల మంది గృహ సారథులు, కన్వీనర్లను నియమించాలని డిసైడ్ అయ్యారు. గురువారం 175 నియోజకవర్గాల పరిశీలకులతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే గృహసారథులు, కన్వీనర్ల నియమాకంపై ఆదేశాలిచ్చారు. వీళ్ళంతా అచ్చంగా పార్టీ తరపున, పార్టీ కోసమే పనిచేస్తారు. ప్రతి 50 ఇళ్ళకు ఇద్దరు గృహ సారథులు, ప్రతీ గ్రామ, వార్డు సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లను నియమించబోతున్నారు.
ఈ నియామకాలన్నీ నియోజకవర్గాల పరిశీలకులే చేస్తారు. డిసెంబర్ 20 నాటికి ఈ నియామకాలు పూర్తయిపోవాలన్నది జగన్ ఆలోచన. వచ్చేఎన్నికల్లో ఒక ప్రభంజనాన్ని సృష్టించి 175కి 175 సీట్లూ వైసీపీనే గెలుచుకోవాలని జగన్ చాలా పట్టుదలగా ఉన్నారు. జగన్ లెక్కప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 1.66 కోట్ల కుటుంబాలున్నాయి. ప్రతి 50 కుటుంబాలకు ఇద్దరు గృహ సారథులుండాలనేది జగన్ ఆలోచన. ఎందుకంటే రేపటి ఎన్నికల్లో ఈ ఇద్దరు గృహసారథులనే బూత్ కమిటీ సభ్యులుగా పనిచేయించుకోవాలన్నది జగన్ ప్లాన్.
మామూలుగా అన్నీపార్టీలు ఓటర్లతో టచ్ లో ఉండటానికి, వాళ్ళని పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లేయించుకోవటానికి బూత్ లెవల్ కోఆర్డినేటర్లను, కమిటీ సభ్యులను నియమించుకుంటాయి. అదే పద్దతిలో జగన్ ఇప్పుడు బూత్ కమిటీలు అని కాకుండా గృహసారథులు అని కొత్త పేరుపెట్టారంతే. చేయాల్సిన పనిమాత్రం ఒకటే. ఇన్ని లక్షల మందిని ఎందుకు నియమించబోతున్నారంటే రేపటి ఎన్నికల్లో వలంటీర్లు అందుబాటులో ఉండరు కాబట్టే.
ఇప్పటికే వలంటీర్లపై టీడీపీ, జనసేనలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేసున్నాయి. ఫిర్యాదులపై కమిషన్ స్పందించి వలంటీర్లను ఎన్నికల విధులనుండి దూరంగా ఉంచాలని ఆదేశించింది. సో.. ఇప్పుడే ఈ సారథులు, కన్వీనర్లను నియమించేసుకుంటే వలంటీర్లు ఇళ్ళకు సంబంధించిన వివరాలను అందించేస్తారు. ఎన్నికలు ఇంకా చాలాసమయం ఉంది కాబట్టి సారథులు, కన్వీనర్లకు వలంటీర్లు అవసరమైన ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఎన్నికల నాటికి తొందరలో అపాయింట్ అయ్యే వాళ్ళంతా పర్ఫెక్టయిపోతారన్నది జగన్ వ్యూహం లాగుంది. అంటే ఈ గృహసారథులే రేపటి ఎన్నికల సారథులుగా పనికొస్తారన్నది జగన్ ఆలోచన.