Telugu Global
Andhra Pradesh

బీసీలకు కీలక పదవి?

బీసీల్లో పట్టున్న, బీసీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని టీటీడీ ఛైర్మన్ గా నియమించబోతున్నట్లు సమాచారం. బోర్డుకు వచ్చే నెల 12వ తేదీన కాలపరిమితి ముగుస్తుంది.

బీసీలకు కీలక పదవి?
X

సోషల్ ఇంజ‌నీరింగ్‌లో జగన్మోహన్ రెడ్డి ఆరితేరిపోయారు. 2019 ఎన్నికలకు ముందు నుండే జగన్ ఏ విషయాన్ని అయినా జాగ్రత్తగా ఆలోచించి చేస్తున్నారు. పార్టీలో పదవులు అయినా, ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లయినా.. చివరకు ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులను కూడా సోషల్ ఇంజనీరింగ్ ప్రకారమే చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ టికెట్లతో పాటు మంత్రివర్గంలో కూడా వీలైనన్నీ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూసుకుంటున్నారు. కాకపోతే జనాభాలో 50 శాతం ఉన్న కారణంగా బీసీ వర్గాలకు పెద్ద పీట వేస్తున్నారు.

ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేయబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అదేమిటంటే తొందరలోనే బీసీ నేతను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా నియమించబోతున్నారట. బీసీల్లో పట్టున్న, బీసీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని టీటీడీ ఛైర్మన్ గా నియమించబోతున్నట్లు సమాచారం. బోర్డుకు వచ్చే నెల 12వ తేదీన కాలపరిమితి ముగుస్తుంది. గతంలో పార్టీ తరపున నియమించిన బీసీ డిక్లరేషన్ రూపకల్పన కమిటీకి కూడా జంగానే ఛైర్మన్‌గా చేశారు. జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన జంగా 1999, 2004లో కాంగ్రెస్ తరపున గురజాల ఎమ్మెల్యేగా పనిచేశారు.

తర్వాత టీడీపీలో కొంతకాలం ఉండి.. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. బీసీ సామాజిక వర్గాల్లో జంగాకు పట్టుంది. అందుకనే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఏ విషయంలో అయినా జగన్‌కు ముందుగా జంగానే గుర్తుకొస్తారు. అందుకనే తొందరలో నియమించాల్సిన టీటీడీ ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌గా కూడా జంగానే అనుకుంటున్నట్లు పార్టీవర్గాల టాక్.

దీనివల్ల ఏమవుతుందంటే తొందరలో రాబోయే ఎన్నికల్లో వైసీపీకి బాగా అడ్వాంటేజ్ వస్తుందని అనుకుంటున్నారు. బీసీల్లో కొన్ని సెక్షన్లు వైసీపీకి మద్దతిస్తున్నా, టీడీపీకి మద్దతిస్తున్నసెక్షన్లు కూడా ఇంకా ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో మొత్తం బీసీ సామాజిక వర్గాన్ని వైసీపీ వైపున‌కు లాగేయాలన్నది జగన్ ప్లాన్. అందుకనే బీసీలకు మ్యాగ్జిమమ్ ప్రాధాన్యతిస్తున్నారు. ఎన్ని పోస్టులలిచ్చినా టీటీడీ ఛైర్మన్ పదవి వేరే ఓ రేంజ్‌లో ఉంటుంది. అందుకనే ఛైర్మన్ పదవి జంగాకు ఇవ్వటం ద్వారా బీసీలకు తాను ఎంత ప్రాధాన్యత ఇస్తున్నానే విషయాన్ని చాటి చెప్పాలని జగన్ అనుకుంటున్నారు.

First Published:  21 July 2023 5:57 AM GMT
Next Story