లండన్ నుంచి వచ్చాక జగన్ ఢిల్లీ టూర్
ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంట్ ప్రత్యేస సమావేశాల్లో పలు కీలక బిల్లుల్ని ప్రవేశ పెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందన్న వార్తల నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ ఆసక్తిగా మారింది.
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో సీఎం జగన్ స్పందన ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో ఉంది. అయితే ఆయన లండన్ లో ఉన్నారు. ఈరోజుతో జగన్, లండన్ పర్యటన ముగుస్తుంది, ఈరోజు అర్థరాత్రి సీఎం జగన్ విజయవాడ చేరుకుంటారు. రేపు ఉదయం ఏపీలో శాంతి భద్రతల పై ఉన్నత స్థాయి సమీక్ష జరుగుతుంది. దీనికోసం ఇప్పటికే రాష్ట్ర హోం శాఖ అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. రేపు సమీక్షలో ఆ నివేదికలు సీఎం జగన్ కి సమర్పిస్తారు.
రెండు రోజుల తర్వాత ఢిల్లీ టూర్..
సీఎం జగన్ ఈరోజు లండన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత రెండు రోజులపాటు రాష్ట్రంలో కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్తారని తెలుస్తోంది. జగన్ ఢిల్లీ టూర్ మరింత ఆసక్తికరంగా మారింది. ఇటు చంద్రబాబు అరెస్ట్, అటు జగన్ ఢిల్లీ టూర్.. అసలేం జరుగుతోందంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది.
ఢిల్లీకి ఎందుకు..?
ఈ నెల 13, 14 తేదీల్లో ఢిల్లీకి వెళ్తారు సీఎం జగన్. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా తో ఆయన సమావేశమయ్యే అవకాశముంది. ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంట్ ప్రత్యేస సమావేశాల్లో పలు కీలక బిల్లుల్ని ప్రవేశ పెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందన్న వార్తల నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ ఆసక్తిగా మారింది. ఆ బిల్లుల ఆమోదానికి వైసీపీ మద్దతు ఎన్డీఏకి అవసరం అని, అందుకే జగన్ తో ఢిల్లీ పెద్దలు ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారని అంటున్నారు. జమిలి ఎన్నికలు, పలు ఇతర అంశాలపై కూడా జగన్ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశముంది.