లాంఛనం పూర్తి.. 5 సంతకాలు పెట్టిన చంద్రబాబు
మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పై చేసిన సీఎం చంద్రబాబు, రెండో సంతకం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకోసం చేశారు. సామాజిక పెన్షన్ల పెంపు ఫైల్ పై మూడో సంతకం చేశారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకోసం నాలుగో సంతకం, నైపుణ్య గణనకోసం ఐదో సంతకం చేశారు.
ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఈరోజు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పూజా కార్యక్రమాల అనంతరం సతీసమేతంగా తన ఛాంబర్ లోకి వెళ్లారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆయన తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పై చేశారు. 16,347 టీచర్ పోస్టులను ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.
కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు:
ఎస్‌జీటీ : 6,371
పీఈటీ : 132
స్కూల్ అసిస్టెంట్స్: 7725
టీజీటీ: 1781
పీజీటీ: 286
ప్రిన్సిపాల్ పోస్ట్ లు: 52
మిగతా సంతకాలు..
మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పై చేసిన సీఎం చంద్రబాబు, రెండో సంతకం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకోసం చేశారు. సామాజిక పెన్షన్ల పెంపు ఫైల్ పై మూడో సంతకం చేశారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకోసం నాలుగో సంతకం, నైపుణ్య గణనకోసం ఐదో సంతకం చేశారు.
ముఖ్యమంత్రిగా తన ఛాంబర్లో చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఫైళ్లపై సంతకాలు చేశారు.
— Telugu Desam Party (@JaiTDP) June 13, 2024
మెగా డీఎస్సీపై తొలి సంతకం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం. పింఛన్‌ను రూ.4 వేలకు పెంచే దస్త్రంపై మూడో సంతకం. అన్న క్యాంటీన్ల… pic.twitter.com/zUB727TxSM
పెన్షన్ల పెంపు ఖాయం..
చంద్రబాబు సంతకం పెట్టేశారు కాబట్టి.. వచ్చే నెల నుంచి సామాజిక పెన్షన్ల పెంపు అమలులోకి వస్తుంది. ఎన్నికల హామీ ప్రకారం జులై-1న బకాయిలతో కలిపి ఒక్కొకరికి రూ.7వేలు పెన్షన్ అందుతుంది. తర్వాతి నెలనుంచి రూ.4వేలు ఇస్తారు. వికలాంగులకు జులై-1నుంచి రూ.6వేలు పెన్షన్ అందుతుంది. ఇక అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కూడా వెంటనే మొదలవుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు లాంఛనమే కాగా, నైపుణ్య గణన మాత్రం మరింతకాలం కొనసాగే ప్రక్రియ అని చెప్పుకోవాలి.