Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు ముడుపుల కేసులో రంగంలోకి సీఐడీ

చంద్రబాబు ముడుపుల వ్యవహారంలో ఐటీ శాఖ వెల్లడించిన మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఆరోపణలను ఎదుర్కొంటున్న యోగేష్‌ గుప్తాకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.

చంద్రబాబు ముడుపుల కేసులో రంగంలోకి సీఐడీ
X

చంద్రబాబు ముడుపుల వ్యవహారంపై దర్యాప్తుకు ఏపీ సీఐడీ కూడా రంగంలోకి దిగుతోంది. అమరావతి నిర్మాణాలు, టిడ్కో ఇళ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్ల నుంచి బోగస్‌ కంపెనీలకు నిధులు మళ్లించి అక్కడి నుంచి ముడుపులు తీసుకున్నారన్న అభియోగాలను చంద్రబాబుపై ఇప్పటికే ఐటీ శాఖ చేసింది. రూ.118 కోట్లు చంద్రబాబుకు వెళ్లినట్టు అభియోగంతో నోటీసులు జారీ చేసింది.

ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలోనూ ఉన్నారని ఏపీ సీఐడీ నిర్ధారణకు వచ్చింది. ఐటీ నోటీసులు జారీ చేసిన ముడుపుల కుంభకోణం, స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం రెండింటి మూలాలు ఓకే చోట ఉన్నట్టు ఏపీ సీఐడీ అనుమానిస్తోంది. చంద్రబాబు ముడుపుల వ్యవహారంలో ఐటీ శాఖ వెల్లడించిన మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఆరోపణలను ఎదుర్కొంటున్న యోగేష్‌ గుప్తాకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.

దుబాయ్‌లో నేరుగా క్యాష్ రూపంలో చంద్రబాబు కోట్లాది రూపాయలు ఇచ్చినట్టు మనోజ్‌ వాసుదేవ్‌ ఐటీకి వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో... ఏపీ సీఐడీ దుబాయ్‌ వెళ్లి కూడా దర్యాప్తు చేయనుంది. ఇందుకోసం ఒక బృందాన్ని సిద్ధం చేస్తున్నారు. స్కిల్‌ కుంభకోణం, అమరావతి నిర్మాణాల కుంభకోణం ముడుపులు చంద్రబాబు పీఏ శ్రీనివాస్ వద్దకే చేరినట్టు ఏపీ సీఐడీ నిర్ధారణకు వచ్చింది.


First Published:  5 Sept 2023 9:51 PM IST
Next Story