రామోజీ, శైలజలకు మరోసారి సీఐడీ నోటీసులు
విజయవాడలోని సీఐడీ రీజనల్ కార్యాలయంలో విచారణ జరుగుతుందని ఆయా తేదీల్లో వారు విచారణకు హాజరుకావాలని సీఐడీ సూచించింది.
BY Telugu Global9 Aug 2023 3:28 PM GMT
X
Telugu Global Updated On: 9 Aug 2023 3:28 PM GMT
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అవకతవకల కేసులో ఆ సంస్థ అధినేత రామోజీరావుకు, ఎండీ శైలజా కిరణ్‌కు సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. వారు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. రామోజీరావు ఈ నెల 16న, శైలజా కిరణ్ ఈ నెల 17వ తేదీన విచారణకు హాజరుకావాలని ఏపీ సీఐడీ ఆదేశించింది.
విజయవాడలోని సీఐడీ రీజనల్ కార్యాలయంలో విచారణ జరుగుతుందని ఆయా తేదీల్లో వారు విచారణకు హాజరుకావాలని సీఐడీ సూచించింది. గతంలోనూ విచారణకు హాజరుకావాలని రామోజీరావుకు, శైలజా కిరణ్‌కు సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో వారు విచారణకు హాజరుకాలేదు. ప్రస్తుతం విచారణ నిమిత్తం 41 (ఎ) కింద సీఐడీ నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి కేసులో రామోజీరావు ఏ-1గా, శైలజా కిరణ్ ఏ-2గా ఉన్న విషయం తెలిసిందే.
Next Story