21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ సమావేశాలు 5 రోజులపాటు జరుగుతాయని తెలుస్తోంది. అవసరాన్ని బట్టి మరో రెండు రోజులు పెంచే అవకాశం కూడా ఉందని సమాచారం.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. 21న ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి సమావేశాలు మొదలవుతాయి. దీనికి ఒకరోజు ముందు అంటే సెప్టెంబర్ 20న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంత్రిమండలి చర్చించనుంది.
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు 5 రోజులపాటు జరుగుతాయని తెలుస్తోంది. అవసరాన్ని బట్టి మరో రెండు రోజులు పెంచే అవకాశం కూడా ఉందని సమాచారం. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ప్రభుత్వం ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంకా పెండింగ్‌లో ఉన్న పలు కీలక హామీల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.