ఇస్రో మరో విజయం.. - పీఎస్ఎల్వీ సీ-56 ప్రయోగం విజయవంతం
మొత్తం 420 కిలోల బరువు గల 7 ఉపగ్రహాలను PSLV C-56 మోసుకెళ్లింది. ఈ ఏడాది ఇస్రో ప్రయోగించిన వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల్లో ఇది మూడోది కావడం విశేషం.
BY Telugu Global30 July 2023 8:02 AM IST
X
Telugu Global Updated On: 30 July 2023 11:11 AM IST
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో విజయం సాధించింది. ఈ సంస్థ ఆదివారం ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ-56 ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ ప్రయోగం చేపట్టారు.
ఆదివారం ఉదయం 6.31 గంటలకు పీఎస్ఎల్వీ-సి56 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్-సార్ ప్రధాన ఉప్రగ్రహంతో పాటు ఆరు చిన్న ఉపగ్రహాలను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
మొత్తం 420 కిలోల బరువు గల 7 ఉపగ్రహాలను PSLV C-56 మోసుకెళ్లింది. ఈ ఏడాది ఇస్రో ప్రయోగించిన వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల్లో ఇది మూడోది కావడం విశేషం.
Next Story