తెనాలిలో కొత్త రచ్చ.. అన్న క్యాంటీన్ వర్సెస్ జగనన్న క్యాంటీన్..
తెనాలిలో అన్నక్యాంటీన్ వద్ద పెద్ద గొడవ జరిగింది. టీడీపీ నేతలు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఆందోళనకు దిగారు. దీంతో తెనాలిలో పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన ఉన్నతాధికారులు అదనపు బలగాలను రప్పించారు.
ఇప్పటికే కుప్పంలో అన్న క్యాంటీన్ వ్యవహారం టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. ఇప్పడు తెనాలిలో కూడా అన్నక్యాంటీన్ ఏర్పాటు రచ్చరచ్చగా మారింది. తెనాలిలో అన్నక్యాంటీన్ కి పోటీగా వైసీపీ నేతలు జగనన్న క్యాంటీన్ పెట్టడం చర్చనీయాంశమైంది. అయితే పోలీసులు ఎవర్నీ ఎంటర్‌టైన్ చేయలేదు. వైసీపీ నేతలు పెట్టిన క్యాంటీన్ ని కూడా తొలగించారు. ఇటు టీడీపీ క్యాంటీన్ ని తరలించడం మాత్రం వివాదానికి దారితీసింది.
నడిరోడ్లో క్యాంటీన్ ఏంటి..?
తెనాలిలో అన్న క్యాంటీన్ పేరుతో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన టెంట్లు, ఇతర ఏర్పాట్లు ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తున్నాయంటూ మున్సిపల్ అధికారులు ఇదివరకే నోటీసులిచ్చారు. క్యాంటీన్ ని తీసివేయాలని హెచ్చరించారు. కానీ టీడీపీ నేతలు తగ్గేది లేదనడంతో, పోలీసుల సాయంతో ఆ అన్నక్యాంటీన్ ని అడ్డుకున్నారు. కూరలు తీసుకొస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ పాత్రల్ని అక్కడినుంచి తరలించారు. టీడీపీ నేతలు కూరలు లేకుండానే అన్నం పంపిణీ చేస్తున్నారు. పోలీసులు పేదలకు పెడుతున్న ఆహారాన్ని కూడా అడ్డుకుంటున్నారని విమర్శించారు.
తెనాలిలో అన్నక్యాంటీన్ వద్ద పెద్ద గొడవ జరిగింది. టీడీపీ నేతలు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఆందోళనకు దిగారు. దీంతో తెనాలిలో పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన ఉన్నతాధికారులు అదనపు బలగాలను రప్పించారు. తెనాలిలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. మార్కెట్ సెంటర్లో షాపులు మూతపడ్డాయి. అన్న క్యాంటీన్ పెట్టి తీరతామని టీడీపీ నేతలు, ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దని మున్సిపల్ అధికారులు, పోలీసులు.. ఇలా రెండు వర్గాలు తమ పంతం నెగ్గించుకోవడానికి పట్టుబట్టాయి. అటు కుప్పంలో కూడా ఇదే విషయంపై గొడవ జరిగి వ్యవహారం కేసుల వరకూ వెళ్లింది. ఇక్కడ తెనాలిలో కూడా అదే సీన్ రిపీటవుతోంది. ఈ నేపథ్యంలో జగనన్న క్యాంటీన్లు కొత్తగా పుట్టుకురావడమే విశేషం. మిగిలినచోట్ల కూడా టీడీపీకి పోటీగా వైసీపీ నేతలు క్యాంటీన్లు ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.