చంద్రబాబుని గుక్కతిప్పుకోనివ్వరా..? నేడు 'అంగళ్లు' బెయిల్ పిటిషన్ పై విచారణ
ఆగస్ట్-4న అంగళ్లులో జరిగిన దాడిలో వైసీపీ కార్యకర్తలకు, పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే ఈ దాడి జరిగినట్టు నిర్థారించిన పోలీసులు ఆయన్ను A1గా చేర్చి కేసు పెట్టారు.
నన్నెవరూ అరెస్ట్ చేయలేరు, నేనసలు జైలుకే వెళ్లలేదు అని ఇన్నాళ్లూ స్టేలు, బెయిళ్ల అండ చూసుకుని చెబుతూ వచ్చారు చంద్రబాబు. కానీ తొలిసారి ఆయన 'స్కిల్' తేడా కొట్టింది. ఒక్కసారి వ్యవహారం తారుమారైన తర్వాత జైలు అనేది ఆయనకు అలవాటుగా మారే అవకాశం కనపడుతోంది. ఎందుకంటే చంద్రబాబుపై వరుస కేసులు విచారణకు వస్తున్నాయి. అంగళ్లులో జరిగిన అల్లర్ల కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ఈరోజు హైకోర్టులో విచారణకు రాబోతోంది. అంగళ్లులో టీడీపీ నేతలు జరిపిన దాడి కేసులో చంద్రబాబు A1.
అన్నమయ్య జిల్లా, అంగళ్లు వద్ద జరిగిన విధ్వంసానికి సంబంధించి ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తుకి పూర్తిగా సహకరిస్తానని, ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం లేదని, తనకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నా చంద్రబాబు మాత్రం ఇప్పటి వరకు హైకోర్టుకి రాలేదు. అయితే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై జైలుకి వెళ్లడంతో ఆయన అలర్ట్ అయ్యారు. అంగళ్లు కేసులో కూడా బెయిల్ కి దరఖాస్తు చేసుకున్నారు. ఈ బెయిల్ పిటిషన్ విచారణ ఈరోజు జరగాల్సి ఉంది.
ఆగస్ట్-4న అంగళ్లులో జరిగిన దాడిలో వైసీపీ కార్యకర్తలకు, పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే ఈ దాడి జరిగినట్టు నిర్థారించిన పోలీసులు ఆయన్ను A1గా చేర్చి కేసు పెట్టారు. మిగతా నిందితుల్ని కూడా కేసులో చేర్చారు. అయితే వారు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. చంద్రబాబు మాత్రం తనను అరెస్ట్ చేయరు అని అనుకున్నారు. అరెస్ట్ చేసినా, రాజకీయ కుట్ర అని తేలిగ్గా చెప్పేయొచ్చు, మైలేజీ పెంచుకోవచ్చు అనుకున్నారు. కానీ స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయి, జైలుకి కూడా వెళ్లడంతో ఆయనలో భయం మొదలైంది. అంగళ్లు కేసులో రిమాండ్ పడినా కూడా సెంటిమెంట్ ఏమాత్రం వర్కవుట్ కాదని తేలిపోయింది. దీంతో ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.