వెంకట్రామిరెడ్డికి న్యాయ చిక్కులు
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఇటీవల న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ఆయన్ని చిక్కుల్లో పడేశాయి.
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఇటీవల న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ఆయన్ని చిక్కుల్లో పడేశాయి. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ హైకోర్టు లాయర్ జడా శ్రవణ్‍కుమార్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‍కు ఫిర్యాదు చేశారు.
ఆయన వ్యాఖ్యలు సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీలోనే విచిత్ర పరిస్థితులన్నాయన్నారు. కొన్ని రాజ్యాంగ సంస్థలు ప్రభుత్వాన్ని నియంత్రించే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేంలో వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మంచి చేసే ప్రభుత్వం ఉందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగి పైనా ఉందని చెప్పారు. అదే సందర్భంలో న్యాయవ్యవస్థలో ఉండే లోపాలపైనా మనం చర్చించుకోవాలన్నారు. ఈ వ్యాఖ్యలే కోర్టు ధిక్కార పిటిషన్‌కు దారితీసినట్లు తెలుస్తోంది.