సీఎం జగన్ తో మాట్లాడిన చిన్నారి మృతి
మొన్నటి భారీ వర్షాలకు అతలాకుతలమైన ఏజెన్సీ ప్రాంతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సమయంలో పాపతో సీఎం ముచ్చటించారు. చాలా చక్కగా మాట్లాడిన ఆ చిన్నారి కన్నుమూసింది.
BY Telugu Global1 Sept 2022 4:59 PM IST

X
Telugu Global Updated On: 1 Sept 2022 4:59 PM IST
మొన్నటి భారీ వర్షాలకు అతలాకుతలమైన ఏజెన్సీ ప్రాంతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సమయంలో పాపతో సీఎం ముచ్చటించారు. చాలా చక్కగా మాట్లాడిన ఆ చిన్నారి కన్నుమూసింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కుయుగురు గ్రామానికి చెందిన కారం సంధ్య(10) జ్వరంతో బాధపడుతోంది. తండ్రి ఏసుబాబు తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ప్రాణం విడిచింది. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జులై 7వ తేదీన వరద బాధితులను పరామర్శించటానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఆ గ్రామ పర్యటన అయ్యేవరకూ చిన్నారి సంధ్య ఆయన వెంటే ఉంది. సీఎం అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెప్పి అలరించింది.
Next Story