టిడిపిలో చేరనున్న ఆనం, ఆదాల కుటుంబాలు?
ఇన్నాళ్లూ వైసీపీలో మౌనంగా ఉన్న అసంతృప్త నేతలు ఒక్కొక్కరూ గళం విప్పుతున్నారు. వైసీపీ కూడా ఆయా నేతలను బుజ్జగించే ప్రయత్నం చేయడం లేదు. వెళ్లేవాళ్లను ఆపే ప్రయత్నం కూడా చేయాలనుకోవడం లేదు.
తెలుగుదేశం పార్టీలోకి వలసలు జోరందుకోనున్నాయి. వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు టిడిపిలో చేరతారని సమాచారం. ఇన్నాళ్లూ వైసీపీలో మౌనంగా ఉన్న అసంతృప్త నేతలు ఒక్కొక్కరూ గళం విప్పుతున్నారు. వైసీపీ కూడా ఆయా నేతలను బుజ్జగించే ప్రయత్నం చేయడం లేదు. వెళ్లేవాళ్లను ఆపే ప్రయత్నం కూడా చేయాలనుకోవడం లేదు.
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాం నారాయణరెడ్డి సొంత పార్టీపై తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ కూడా వాటిని సీరియస్‌గా తీసుకోలేదు కానీ, ఆనంని తప్పించే విషయం మాత్రం సీరియస్‌గానే ఆలోచించింది. నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని నియోజవకర్గ వైసీపీ ఇన్‌చార్జిగా నియమించి.. ఆనం ఎటు పోయినా ఏమీ అనం అంటూ సంకేతాలు ఇచ్చింది. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా చాలా రోజులుగా మౌనంగా ఉంటున్నారు.
గత ఎన్నికల్లో టిడిపి టికెట్ అనౌన్స్ చేశాక వచ్చి వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆదాలకి ఇవ్వరని అందరికీ తెలిసిపోయింది. మరో మార్గం లేని ఆదాల మళ్లీ టిడిపిలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారు.
ఆనం, ఆదాలకి తెలుగుదేశం పార్టీ తలుపులు తెరిచిందని సమాచారం. ఏ సీట్లు ఇస్తారో, ఎక్కడి నుంచి పోటీ చేయిస్తారో క్లారిటీ లేదు.. కానీ, పార్టీలో మాత్రం చేర్చుకునేది ఖాయం అని చెప్పారట. దీంతో నేడో రేపో నెల్లూరు జిల్లాకి చెందిన వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు తమ కుటుంబాలతో సహా టిడిపిలో చేరతారట.