స్టేజిపైనే అమిత్ షా వార్నింగ్.. ఎందుకంటే!
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు కూడా సాధించలేదు. దీంతో తమిళి సై, అన్నామలైల మధ్య విబేధాలు తలెత్తాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
చంద్రబాబు ప్రమాణస్వీకారం వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మాజీ గవర్నర్ తమిళిసైకి సంబంధించి ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 18 సెకండ్ల నిడివి గల ఈ వీడియోపై ఇప్పుడు భిన్నరకాలుగా చర్చ జరుగుతోంది. అమిత్ షా తమిళిసైకి వార్నింగ్ ఇచ్చినట్లు స్పష్టంగా వీడియోలో కనిపిస్తోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.?
ప్రమాణస్వీకార వేదికపైకి వచ్చిన మాజీ గవర్నర్ తమిళిసై అక్కడున్న పెద్దలందరికీ నమస్కరిస్తూ ముందుకు వెళ్లారు. ఇదే సమయంలో ఆమెను వెనక్కి పిలిచిన హోం మంత్రి అమిత్ షా ఆమెతో మాట్లాడారు. వేలు చూపుతూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. మధ్యలో తమిళిసై ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అమిత్ షా వినిపించుకోలేదు.
Clear warning from Shah- you can see him saying ‘aise mat karna’ https://t.co/DuGxvmo96W
— Akshita Nandagopal (@Akshita_N) June 12, 2024
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు కూడా సాధించలేదు. దీంతో తమిళి సై, అన్నామలైల మధ్య విబేధాలు తలెత్తాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇదే విషయమై అమిత్ షా తమిళిసైపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తమిళిసై 2014 నుంచి 19 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు. తర్వాత తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన ఆమె.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చెన్నై సౌత్ నుంచి పోటీ చేసి భారీ తేడాతో ఓడిపోయారు.