ఇంతకీ అమిత్ షా ని పవన్ కలిశారా..? అంత రహస్యమేంటి..?
జనసేన నుంచి అధికారికంగా ఎక్కడా ప్రకటన రాలేదు. కనీసం ట్విట్టర్లో హడావిడి లేదు. ఒక్క ఫొటో కూడా పోస్ట్ చేయలేదు. అసలు అమిత్ షా ని పవన్ కలిశారా..? కలిస్తే జనసేన నుంచి ఈ మౌనం ఏంటి అనేదే ఇప్పుడు ఆసక్తికర అంశం.
పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి అమిత్ షా ని కలిశారు, తెలంగాణలో బీజేపీ-జనసేన కలసి పోటీ చేసే విషయంలో చర్చలు జరిగాయనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్. పవన్ తోపాటు కిషన్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారని, దాదాపు 40నిమిషాల సేపు చర్చ జరిగిందని టీడీపీ అనుకూల మీడియా చెబుతోంది. కానీ దీనికి ఆధారాలు లేవు. చర్చల తర్వాత ఎవరూ మీడియాతో మాట్లాడలేదు. అన్నిటికంటే ఆసక్తికర విషయం ఏంటంటే.. జనసేన నుంచి అధికారికంగా ఎక్కడా ప్రకటన రాలేదు. కనీసం ట్విట్టర్లో హడావిడి లేదు. ఒక్క ఫొటో కూడా పోస్ట్ చేయలేదు. అసలు అమిత్ షా ని పవన్ కలిశారా..? కలిస్తే జనసేన నుంచి ఈ మౌనం ఏంటి అనేదే ఇప్పుడు ఆసక్తికర అంశం.
ఏపీలో టీడీపీతో కలసి వెళ్తామని ప్రకటించిన జనసేన.. బీజేపీతో తెగతెంపులు చేసుకునేందుకు మాత్రం ఆలోచిస్తోంది. తెలంగాణలో తొలిజాబితా ప్రకటించేటప్పుడు జనసేనను పరిగణలోకి తీసుకోలేదు బీజేపీ. అదే సమయంలో జనసేన కూడా 33 సీట్లకు అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తులు చేస్తోంది. సడన్ గా పవన్ కల్యాణ్ ని కిషన్ రెడ్డి కలవడంతో సీన్ మారింది. రెండు పార్టీలు కలసి పోటీ చేస్తాయనే ప్రచారం మొదలైంది. మరి తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకం. ఈ కన్ఫ్యూజన్ లో పవన్ ఢిల్లీ పర్యటనపై వార్తలు వచ్చాయి.
జనసేనకు, టీడీపీకి తెలంగాణ ఎన్నికల విషయంలో పెద్దగా ఆశలు లేవు. ఏపీలో మాత్రం కలసి పనిచేయాలనుకుంటున్నాయి. ఈ దశలో ఆ రెండు పార్టీలు తెలంగాణలో వేలు పెట్టడానికి కారణం బీజేపీని కాస్త కదిలించాలనికే. అందుకే ఢిల్లీనుంచి పవన్ కు పిలుపొచ్చిందని అంటున్నారు. అయితే అమిత్ షా భేటీని జనసేన రహస్యంగా ఉంచాలనుకోవడమే ఆసక్తికర అంశం. ఢిల్లీ పర్యటన, అందులోనూ అమిత్ షా ని కలవడం అంటే.. జనసేన ఎక్కడలేని ఎలివేషన్లు ఇస్తుంది. కానీ ఈ భేటీపై మాత్రం ఎవరూ నోరు మెదపడం లేదు, ఎందుకో..?