నాకూ ఓ 'కులం' ఉంది - అంబటి.. రసి'కుల'మే కదా - అయ్యన్న
నాకూ 'కులం' ఉంది అని అంబటి ట్వీట్ చేయడంతో టీడీపీ ఆ ట్వీట్ ని కామెడీ చేస్తూ రసి'కులం' అంటూ రెచ్చగొడుతోంది.
ఖమ్మంలో మంత్రి దాడి ప్రయత్నం ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కావాలనే కొంతమంది కులోన్మాదంతో తనపై దాడి చేయాలనుకున్నారని మండిపడ్డారు అంబటి. నాకూ ఒక 'కులం' ఉంది, గుర్తుపెట్టుకోండి ! అంటూ ఆయన హెచ్చరిస్తూ ట్వీట్ వేశారు. ఇప్పుడు టీడీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. కులం అంటున్న అంబటికి అయన్నపాత్రుడు సమాధానమిచ్చారు.అందరికీ తెలిసిందేగా "రసికులం".. అంటూ సెటైర్ వేశారు.
. అందరికీ తెలిసిందేగా "రసికులం".. @AmbatiRambabu https://t.co/gZraslT5Pa
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) October 27, 2023
కమ్మ వర్సెస్ కాపు..
పవన్ కల్యాణ్ ని విమర్శించేందుకు వైసీపీలో కాపు సామాజిక వర్గ నేతలు ఎక్కువ ఉత్సాహం చూపిస్తుంటారు. పార్టీ కూడా వారినే ఎక్కువగా ప్రోత్సహిస్తుటుంది. ఈ క్రమంలో అంబటి రాంబాబు, పవన్ మధ్య జరిగిన ఎపిసోడ్లు అందరికీ తెలుసు. అవి కాస్తా బ్రో సినిమాతో మరింత వ్యక్తిగతం అయ్యాయి. అక్కడ 'కాపు వర్సెస్ కాపు' కాబట్టి కుల రాజకీయాలకు చోటు లేదు. అయితే ఇప్పుడు ఖమ్మంలో దాడి ప్రయత్నం మాత్రం 'కమ్మ వర్సెస్ కాపు' గా మారింది. కమ్మ నేతలు తనపై దాడి చేశారని అంబటి పరోక్షంగా ప్రస్తావించారు. ఇలాంటి కులోన్మాదంతోనే వంగవీటి రంగాని హతమార్చారని, ముద్రగడ పద్మనాభంపై దాడి చేశారని, ఇప్పుడు తన వంతు వచ్చిందని చెప్పారు. దాడులు చేస్తామంటే తాము చేతులు కట్టుకుని కూర్చోబోమని హెచ్చరించారు. ప్రత్యేకంగా అంబటి కులాన్ని ప్రస్తావించడంతో మరోసారి ఇక్కడ క్యాస్ట్ వార్ హైలైట్ అయింది. వంగవీటి రంగా, ముద్రగడ పేర్లను కూడా అంబటి ఈ వ్యవహారంలోకి తీసురావడం విశేషం.
మంత్రి అంబటి కారుపై దాడి యత్నం ఘటనలో పోలీసులు ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు. అయితే మంత్రి స్థాయి వ్యక్తిపై దాడికి ప్రయత్నం జరగడం మాత్రం కలకలంగా మారింది. మంత్రికి షాక్ అంటూ ఎల్లో మీడియా అంబటిని మరింత కవ్విస్తోంది. దీంతో ఆయన తీవ్రంగా మండిపడుతూ ప్రెస్ మీట్ పెట్టారు. నాకూ 'కులం' ఉంది అని ట్వీట్ చేయడంతో టీడీపీ ఆ ట్వీట్ ని కామెడీ చేస్తూ రసి'కులం' అంటూ రెచ్చగొడుతోంది.
♦