Telugu Global
Andhra Pradesh

అంబటి - శ్యాంబాబు.. ఏంటి 'బ్రో' ఇది

ట్విట్టర్లో శ్యాంబాబు అని టైప్ చేస్తే చాలు అంబటి రాంబాబు డ్యాన్స్, ఆ తర్వాత 'బ్రో' సినిమాలో పవన్ డైలాగులతో మిక్స్ చేసిన వీడియోలు వచ్చేస్తున్నాయి. 'బ్రో' సినిమాకంటే ఇప్పుడు శ్యాంబాబు ట్రెండింగ్ సబ్జెక్ట్ గా మారింది.

అంబటి - శ్యాంబాబు.. ఏంటి బ్రో ఇది
X

శ్యాంబాబు..!

వస్తున్న టెంపో ఏంటి.. నువ్వు వేస్తున్న స్టెప్పులేంటి..?

తకిట తకిటత 6-8

తకథిమి తకథిమిత 2-4

లేటెస్ట్ సినిమా 'బ్రో' లో పవన్ కల్యాణ్ డైలాగ్ ఇది. ఇక్కడ శ్యాంబాబు క్యారెక్టర్ ని పృథ్వీ చేశారు. అతడిని తిట్టి తన కసి తీర్చుకునేలా సినిమాలో రెండు డైలాగులు కొట్టారు పవన్ కల్యాణ్.

అంబటి సంక్రాంతి డ్యాన్స్..

ఆమధ్య అంబటి రాంబాబు సంక్రాంతి సందర్భంగా మహిళలతో కలసి డ్యాన్స్ చేసిన వీడియో అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో అంబటి డ్యాన్స్ సోషల్ మీడియాలో బాగా పాపులర్. ఆ వీడియోని 'బ్రో' సినిమాలో ఇమిటేట్ చేశారు. అప్పట్లో అంబటి వేసిన టీషర్ట్, ఫ్యాంట్ ని యాజిటీజ్ గా ఇక్కడ దించేశారు. అసలా టీషర్ట్ ఎలా సంపాదించారు 'బ్రో' అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సెటైర్లు పేలుతున్నాయి. ట్విట్టర్లో శ్యాంబాబు అని టైప్ చేస్తే చాలు అంబటి రాంబాబు డ్యాన్స్, ఆ తర్వాత 'బ్రో' సినిమాలో పవన్ డైలాగులతో మిక్స్ చేసిన వీడియోలు వచ్చేస్తున్నాయి. 'బ్రో' సినిమాకంటే ఇప్పుడు శ్యాంబాబు ట్రెండింగ్ సబ్జెక్ట్ గా మారింది.

అంబటి రియాక్షన్..

అంత పబ్లిక్ గా పవన్ సెటైర్ వేసిన తర్వాత మంత్రి అంబటి రాంబాబు ఊరుకుంటారా..? కాస్త ఉడుక్కున్నారు. ట్విట్టర్లో బదులిచ్చారు.

గెలిచినోడి డాన్స్ సంక్రాంతి !

ఓడినోడి డాన్స్ కాళరాత్రి !

ఇదీ సింపుల్ గా ఆయన చేసిన ట్వీట్.


నేరుగా పవన్ కల్యాణ్ ని ఏమీ అనలేదు అంబటి రాంబాబు. అలాగని తన డ్యాన్స్ ని కామెంట్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలనుకోలేదు. అందుకే సింపుల్ గా సంక్రాంతి, కాళరాత్రి అంటూ ఓ కొటేషన్ తో సరిపెట్టారు.

First Published:  29 July 2023 11:42 AM IST
Next Story