నేను కాపు బిడ్డ.. నాది తెలుగు గడ్డ
బాలకృష్ణకి కూడా ట్విట్టర్లోనే ఘాటుగా బదులిచ్చారు. "నేను కాపుబిడ్డ.. నాది తెలుగు గడ్డ" అంటూ పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు అంబటి.
సహజంగా పవన్ కల్యాణ్ ని విమర్శించడానికి, పవన్ పై సెటైర్లు వేయడానికి మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ ని ఎక్కువగా వాడుతుంటారు. అప్పుడప్పుడు చంద్రబాబుపై కూడా ఆయన ట్విట్టర్లోనే ఘాటుగా కౌంటర్లు వేస్తుంటారు. ఇప్పుడు బాలయ్యని కూడా ఈ గ్రూప్ లో చేర్చారు అంబటి. బాలకృష్ణకి కూడా ట్విట్టర్లోనే ఘాటుగా బదులిచ్చారు. "నేను కాపుబిడ్డ.. నాది తెలుగు గడ్డ" అంటూ పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.
"నా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని
మీసం తిప్పితే ఊరుకోడానికి
ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ !
నాది తెలుగు గడ్డ !"
అంబటి వేసిన ట్వీట్ ఇది. అయితే ఇక్కడ కాపు బిడ్డ అని ప్రత్యేకంగా అంబటి నొక్కి చెప్పడం గమనార్హం. పవన్ కల్యాణ్ ఇటీవల టీడీపీతో పొత్తు ఖాయం చేయడంతో ఆ వర్గం ఓట్ల విషయంలో వైసీపీ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం అంబటి ట్వీట్ లో కూడా కాపు వర్గాన్ని హైలైట్ చేయడం విశేషం. బాలయ్య లాంటి వాళ్లు మీసం తిప్పితే కాపు బిడ్డలు ఊరుకోరు అంటూ పరోక్ష హెచ్చరికలు చేశారు అంబటి. పొయెటిక్ గా రాసినా కూడా అంబటి కాపు అనే ప్రస్తావన తేవడం ఇక్కడ ప్రత్యేకంగానే కనిపిస్తోంది.
నా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని
— Ambati Rambabu (@AmbatiRambabu) September 21, 2023
మీసం తిప్పితే ఊరుకోడానికి
ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ !
నాది తెలుగు గడ్డ !@naralokesh @ncbn @JaiTDP
ఇక అసెంబ్లీలో బాలయ్య మీసం మెలేయడంతో అంబటి.. రా చూసుసుందాం అంటూ సభలోనే సవాల్ విసిరారు. ఈ ఎపిసోడ్ ఈరోజు ఉదయం హాట్ హాట్ గా సాగింది. అయితే సభలో కెమెరాల ఫోకస్ అంతా అధికార పార్టీ సభ్యులపైనే ఉండటంతో బాలయ్య మీసం మెలేసిన సీన్ బయటకు రాలేదు, ఇంకా సభలో ఎవరెవరు ఏమేం చేశారనేదానికి వీడియా సాక్ష్యాలు లేవు. టీడీపీ నేతలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి గొడవ చేసిన వీడియో మాత్రం బయటకొచ్చింది. బాలకృష్ణ, అంబటి సవాళ్లు, ప్రతిసవాళ్లతో అసెంబ్లీ సమావేశాల తొలిరోజు రచ్చ రచ్చ జరిగింది.
♦