Telugu Global
Andhra Pradesh

పవన్ కల్యాణ్ కి ఫుల్ డోస్ ఇచ్చేసిన అంబటి

పవన్ కల్యాణ్ వల్ల ఎవరికీ లాభం లేదు, నష్టం లేదని, అలాంటి పవన్ ని చంపించడానికి ఎవరు రెక్కీ నిర్వహిస్తారని ఎద్దేవా చేశారు అంబటి. గతంలో ప్యాకేజీ స్టార్ గా ఉండే పవన్ ఇప్పుడు బూతుల స్టార్ గా మారాడని సెటైర్లు పేల్చారు.

పవన్ కల్యాణ్ కి ఫుల్ డోస్ ఇచ్చేసిన అంబటి
X

పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటం వేస్ట్ అంటూనే ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. కాకినాడ సభలో పవన్ మాట్లాడిన ప్రతి మాటకు కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ పిచ్చివాడు, మతి స్థిమితం లేదు, ఆయనతో కలసి ఉండే విషయంలో జనసైనికులు, వీర మహిళలు మరోసారి ఆలోచించుకోవాలని సూచించారు అంబటి. పొరపాటున పవన్ మాటలకు ఎవరైనా ప్రభావితం అవుతారేమోననే ఉద్దేశంతోటే తాను ప్రెస్ మీట్ పెట్టానని చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత జనసేన ఉంటుందో లేదో కూడా తెలియదన్నారు అంబటి.

నీకు పుట్టగతులుండవ్ జాగ్రత్త..

వారాహి అంటూ అమ్మవారి పేరు పెట్టుకున్న వాహనంపై ఎక్కి పవన్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, ఆయనకు పుట్టగతులు ఉండవన్నారు. మళ్లీ ఓడిపోతావ్ రాసి పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చారు. అమ్మవారి శాపం పవన్ కు తగులుతుందన్నారు. ఇప్పుడు చెప్పులే పోగొట్టుకున్నావ్, రేపు బట్టలు కూడా పోగొట్టుకుంటావ్. డ్రాయర్, బన్నీన్ పై నిలబడతావు జాగ్రత్త అంటూ హెచ్చరించారు.


నీవల్ల ఎవరికి ఉపయోగం..?

పవన్ కల్యాణ్ వల్ల ఎవరికీ లాభం లేదు, నష్టం లేదని, అలాంటి పవన్ ని చంపించడానికి ఎవరు రెక్కీ నిర్వహిస్తారని ఎద్దేవా చేశారు అంబటి. గతంలో ప్యాకేజీ స్టార్ గా ఉండే పవన్ ఇప్పుడు బూతుల స్టార్ గా మారాడని సెటైర్లు పేల్చారు. అసెంబ్లీకి రాకుండా పవన్ ని ఎవరూ ఆపబోరని, ఆయనకు ఆయనే బ్రేక్ లు వేసుకుంటారని, ఇప్పుడైనా ఆయన అసెంబ్లీకి రావొచ్చని, పాస్ ఇప్పిస్తా గ్యాలరీలో కూర్చో అంటూ చురకలంటించారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఢిల్లీలో ఫైల్ ఓపెన్ అయిందో లేదో కానీ, పవన్ కల్యాణ్ పై మాత్రం రష్యాలో ఫైల్ ఓపెన్ అయిందన్నారు.

బట్టలూడదీసి కొడతా, ఇంట్లోనుంచి లాక్కొచ్చి కొడతా అంటూ పవన్ ఆవేశంలో మాట్లాడుతున్నారని, తాము అంత చేతగానివాళ్లమా అని ప్రశ్నించారు. అసలు రౌడీలు, క్రిమినల్స్ ఎక్కడున్నారని అడిగారు. పవన్ ప్రవర్తన విచిత్రంగా ఉంటుందని ప్రజారాజ్యం గురించి అసలు పవన్ ఎందుకు మరచిపోయాడన్నారు. యువరాజ్యం నుంచి ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉన్న ఆయన అసలేం సాధించారని నిలదీశారు అంబటి.

కరకట్ట ప్రకాష్ రాజ్..

పనిలో పనిగా చంద్రబాబుపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అంబటి రాంబాబు. ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకున్నారంటూ సీఎం జగన్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని లాక్కుంది చంద్రబాబేనని గుర్తు చేశారు. శ్రీవాణి ట్రస్ట్ గురించి తప్పుడు మాటలు మాట్లాడితే పాపం తగులుతుందన్నారు. చంద్రబాబు కరకట్ట ప్రకాష్ రాజ్ అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివని, కౌరవ వధ జరగడం ఖాయమన్నారు అంబటి రాంబాబు.

First Published:  19 Jun 2023 6:06 PM IST
Next Story