Telugu Global
Andhra Pradesh

ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా.. అంబటి సెటైర్లు

లోకేష్ 400 రోజుల యాత్రని ఇలా కామెడీ చేశారు అంబటి. లోకేష్ 400 రోజులు యాత్ర చేసినా ఉపయోగం ఏమీ లేదన్నారు. జగన్ లాగా పాదయాత్ర చేయడం అందరికీ సాధ్యం కాదని, లోకేష్ యాత్ర చేసినా నాయకుడు కాలేడన్నారు.

ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా.. అంబటి సెటైర్లు
X

నారా లోకేష్ 400రోజుల పాదయాత్ర మొదలైంది. అందరి ఆశీర్వాదాలు తీసుకుని, తండ్రి నియోజకవర్గం నుంచి యాత్ర మొదలు పెట్టారు లోకేష్. ఈ యాత్రపై ఇప్పటికే వైసీపీ నుంచి ఓ రేంజ్ లో కౌంటర్లు పడుతున్నాయి. లోకేష్ యాత్ర దేనికోసం, ఎవరికోసం అంటున్నారు వైసీపీ నేతలు. తాజాగా అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా లోకేష యాత్రపై సెటైర్లు పేల్చారు.

"ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా

నలుపు నలుపే గానీ తెలుపు రాదు !

గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు

పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడు !"

అంటూ ఓ ట్వీట్ వేశారు అంబటి. లోకేష్ 400 రోజుల యాత్రని ఇలా కామెడీ చేశారు అంబటి. లోకేష్ 400 రోజులు యాత్ర చేసినా ఉపయోగం ఏమీ లేదన్నారు. జగన్ లాగా పాదయాత్ర చేయడం అందరికీ సాధ్యం కాదని, లోకేష్ యాత్ర చేసినా నాయకుడు కాలేడన్నారు.


పవన్ కల్యాణ్ పై అంబటి పంచ్ లు..

రిపబ్లిక్ డే రోజున పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా అంబటి ట్విట్టర్లో స్పందించారు.

"పవిత్రమైన దీపారాధనతో సిగరెట్టు ముట్టించుకునే వాడని స్వర్గంలో ఉన్న తండ్రినే అవమానపరిచే పుత్రుడు సమాజానికి అవసరమా ?" అన్నారు. మా నాన్న నాస్తికుడు అంటూ పవన్ అన్న మాటలకు అంబటి ఇలా స్పందించారు.


"మా నాన్న నాస్తికుడు.. మా నాయనమ్మ దీపారాధన చేస్తే ఆయన సిగరెట్ వెలిగించుకుని దేవుడు లేడు.. దెయ్యం లేడు అనే వాడు.. కానీ, ఆ తర్వాత కాలంలో తానేదో తప్పు చేశానని ప్రతి రోజూ బాధపడేవారు.. అందుకే ఇది మన సంప్రదాయం అని గుర్తించాలి, మన సంప్రదాయాలను గౌరవించాలి" అని ఓ కార్యక్రమంలో పవన్ వ్యాఖ్యానించారు. స్వర్గంలో ఉన్న తండ్రిని తక్కువచేసి చూపించే విధంగా పవన్ మాట్లాడారంటూ అంబటి కౌంటర్లు ఇచ్చారు.

First Published:  27 Jan 2023 11:51 AM IST
Next Story