బాబు కుర్చీ మడతేసిన భువనేశ్వరి.. అంబటి సెటైర్
రాజ్యసభలో టీడీపీ సీట్లు ఖాళీ అవడంపై కూడా అంబటి సెటైరిక్ గా స్పందించారు. "రాజ్యసభలో కుర్చీ మడతేసిన టీడీపీ అతి త్వరలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా!" అంటూ ట్వీట్ వేశారు.
ఏ మహూర్తాన నారా లోకేష్ స్టేజ్ పై కుర్చీ మడతబెట్టి వెటకారం మొదలు పెట్టారో కానీ.. వైసీపీ నుంచి వరుసగా రివర్స్ అటాక్ లు మొదలయ్యాయి. ఏపీ ప్రజలు చంద్రబాబుకి ఏనాడో కుర్చీ మడతెట్టేశారని, ఆ విషయం ఆయన ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారని అంటున్నారు వైసీపీ నేతలు. మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్లో వరుసగా సెటైర్లు పేలుస్తున్నారు. తాజాగా నారా భువనేశ్వరి కామెంట్స్ పై కూడా అంబటి స్పందించారు. బాబు కుర్చీని భువనేశ్వరి మడతేశారంటూ ట్వీట్ చేశారు అంబటి.
బాబు గారి కుర్చీని
— Ambati Rambabu (@AmbatiRambabu) February 21, 2024
భువనేశ్వరి గారు మడతేసేసింది !@ncbn @naralokesh
అంతకు ముందు రాజ్యసభలో టీడీపీ సీట్లు ఖాళీ అవడంపై కూడా అంబటి సెటైరిక్ గా స్పందించారు. "రాజ్యసభలో కుర్చీ మడతేసిన టీడీపీ అతి త్వరలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా!" అంటూ ట్వీట్ వేశారు. వైనాట్ 175 అనేది మాటల్లోనే కాదని, చేతల్లో కూడా చూపిస్తామంటున్నారు అంబటి.
సోషల్ మీడియాలో కూడా లోకేష్ కుర్చీ మడత వ్యవహారం వైరల్ గా మారింది. నారా లోకేష్ తనని తాను అతిగా ఊహించుకుంటున్నారని సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. స్టేజ్ పై పంచ్ డైలాగులు కొట్టడంతోపాటు, కుర్చీని మడతపెట్టడం కూడా చూపించాలా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఆమాత్రం కుర్చీ మడతబెట్టే ట్యాలెంట్ ఉంటే మంగళగిరిలో గెలిచి అసెంబ్లీకి రావాలంటూ సవాల్ విసురుతున్నారు. వైసీపీ నేతలు కూడా టీడీపీని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి అంబటి రాంబాబు గ్యాప్ లేకుండా ట్వీట్లు వేస్తూ టీడీపీ పరువు తీస్తున్నారు.