Telugu Global
Andhra Pradesh

నేనే పిచ్చుక, నాపైనే బ్రహ్మాస్త్రం వేశారు..

తమ్ముడివైపు కాకుండా ధర్మంవైపు నిలబడాలంటూ నిన్న చిరంజీవికి కౌంటర్ ఇచ్చిన అంబటి.. ఈరోజు పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అనే చిరు మాటల్ని రిపీట్ చేశారు.

నేనే పిచ్చుక, నాపైనే బ్రహ్మాస్త్రం వేశారు..
X

పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటూ చిరంజీవి చెప్పిన మాటలు ఏపీ రాజకీయాల్లో ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలుసు. ఆయనపై వైసీపీ నుంచి వరుసగా మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా మరోసారి మంత్రి అంబటి రాంబాబు చిరంజీవి వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. తమ్ముడివైపు కాకుండా ధర్మంవైపు నిలబడాలంటూ నిన్న చిరంజీవికి కౌంటర్ ఇచ్చిన అంబటి.. ఈరోజు పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అనే చిరు మాటల్ని రిపీట్ చేశారు. అయితే చిరంజీవి అన్నట్టుగా సినీ ఇండస్ట్రీ పిచ్చుక కాదని, తానే పిచ్చుకని అని, తనపైనే 'బ్రో' సినిమాలో బ్రహ్మాస్త్రం వేశారని చెప్పుకొచ్చారు.


గోకాడా లేదా..?

'బ్రో' మూవీలో శ్యాంబాబు అనే పాత్ర పెట్టి పవన్ కల్యాణ్ తనను గోకాడా లేదా అంటూ మీడియాను ప్రశ్నించారు మంత్రి అంబటి. తనను గోకారు కాబట్టే, తాను స్పందించాల్సి వచ్చిందన్నారు. తనకు చిరంజీవి అంటే ఎంతో అభిమానమన్నారు. ఆ అభిమానం కూడా ఎందుకో వివరించారు. ముద్రగడ పద్మనాభం ఇంట్లో కష్టం వస్తే చిరంజీవి, దాసరి వచ్చారని, అందుకే తనకు చిరంజీవి అంటే గౌరవం, అభిమానం అని చెప్పారు. ఇప్పుడు తనకు ఇబ్బంది వచ్చిందని, తనపైనే బ్రహ్మాస్త్రం ప్రయోగించారని చెప్పారు అంబటి.

ఫోన్ కనిపెట్టిన బాబుకి సెల్ఫీ కష్టమైంది..!!

సెల్ ఫోన్ కనిపెట్టానని చెప్పుకునే చంద్రబాబుకి సెల్ఫీ తీసుకోవడం కష్టంగా మారిందని ఎద్దేవా చేశారు మంత్రి అంబటి రాంబాబు. 1995 నుంచి 2004 వరకు పోలవరం అనే మాట కూడా చంద్రబాబు ఉచ్ఛరించ లేదని, పోలవరంను మొదలు పెట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు కర్ర తీసుకుని బయలుదేరారని సెటైర్లు వేశారు. పోలవరం ప్రాజెక్ట్ లో అడ్డగోలుగా దోచుకునే పని చంద్రబాబు చేశారని మండిపడ్డారు. బాబు చేసింది ప్రాజెక్ట్ పని కాదని, దోపిడీ అని అన్నారు.

First Published:  9 Aug 2023 3:21 PM IST
Next Story