Telugu Global
Andhra Pradesh

ఎన్నికల ఫలితాల తర్వాత అంబటి మొదటి ట్వీట్ ఇదే

"Super 6 అమలు కన్నా, Ycp ఆఫీసు కూల్చడమే ముఖ్యమని చంద్రబాబు భావించారా..?" అని ప్రశ్నిస్తున్నారు అంబటి.

ఎన్నికల ఫలితాల తర్వాత అంబటి మొదటి ట్వీట్ ఇదే
X

ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత చాలామంది వైసీపీ నాయకులు మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. గతంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అంబటి రాంబాబు వంటి నేతలు కూడా పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇటీవల పోలవరం వ్యవహారంలో అంబటి మీడియా ముందుకొచ్చినా, సోషల్ మీడియాలో మాత్రం ఆయన మార్కు స్టేట్ మెంట్లు ఇప్పటి వరకు మొదలు కాలేదు. అంబటితోపాటు మిగతా నేతలందరికీ ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. వైసీపీ ఆఫీస్ కూల్చివేత నేపథ్యంలో అంబటి రాంబాబు ట్విట్టర్లోకి రీఎంట్రీ ఇచ్చారు. చంద్రన్న ప్రజాస్వామ్యవాదా..? విధ్వంసకారుడా..? అంటూ సూటిగా ప్రశ్నించారు అంబటి.


వైసీపీ ఆగ్రహం..

నీటిపారుదల శాఖకు చెందిన స్థలంలో, అది కూడా అనుమతులేవీ లేకుండా, కనీసం ప్లాన్ కూడా మున్సిపల్ అధికారులకు ఇవ్వకుండా పార్టీ ఆఫీస్ కడుతున్నారనేది ప్రధాన ఆరోపణ. అందుకే దాన్ని అధికారులు కూల్చేశారని టీడీపీ నేతలు అంటున్నారు. అది కబ్జా అని, ఆక్రమణ అని, అందుకే కూల్చివేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఘాటుగా రియాక్ట్ అవుతోంది. ఎన్నికల హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కూటమి ప్రభుత్వం ఇలాంటి నాటకాలాడుతోందని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఇదే విషయంలో ఘాటు ట్వీట్ వేశారు.

"Super 6 అమలు కన్నా, Ycp ఆఫీసు కూల్చడమే ముఖ్యమని చంద్రబాబు భావించారా..?" అని ప్రశ్నిస్తున్నారు అంబటి. ఇది ప్రజాస్వామ్యం కాదని, విధ్వంసమేనని విమర్శించారు. టీడీపీ నేతలు మాత్రం ప్రజావేదికతో పోలిక చెబుతున్నారు. అప్పుడు ప్రజావేదిక కూల్చినప్పుడు వైసీపీ నేతలు ఎందుకు చంకలు గుద్దుకున్నారని, ఇప్పుడు వైసీపీ ఆఫీస్ కూల్చి వేస్తే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

First Published:  22 Jun 2024 3:57 AM GMT
Next Story