Telugu Global
Andhra Pradesh

అమరావతి జేఏసీ తట్టుకోలేకపోతోందా?

అమరావతి జేఏసీ నేత‌ల‌ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే కోర్టుల్లో కేసులు తేలేదాకా ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇవ్వకూడదని పట్టుబట్టారు. తీరా ప్ర‌భుత్వానికి ప్ర‌తి కోర్టులో తీర్పు అనుకూలంగా వ‌చ్చేస‌రికి త‌ట్టుకోలేక‌పోతున్నారు.

అమరావతి జేఏసీ తట్టుకోలేకపోతోందా?
X

అమరావతి జేఏసీ తట్టుకోలేకపోతోంది. పేదలకు పట్టాలు ఇవ్వటానికి ప్రభుత్వం వేదిక సిద్ధంచేయటాన్ని అమరావతి జేఏసీ రైతుల ముసుగులో ఉన్న రియాల్టర్లు, టీడీపీ నేతలు అడ్డుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం తుళ్ళూరులో జేఏసీ+జై భీం భారత్ పార్టీ వ్యవస్ధాపకుడు జడ శ్రవణ్ కుమార్ మద్దతుదారులకు మధ్య పెద్ద ఘర్షణే జరిగింది. నిజానికి శ్రవణ్‌కు ప్రత్యేకించి మద్దతుదారులంటు పెద్దగా లేరు. ఉన్నదంతా టీడీపీ కార్యకర్తలే.

అమరావతి జేఏసీ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే కోర్టుల్లో కేసులు తేలేదాకా ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇవ్వకూడదని పట్టుబట్టారు. ముందు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు ఆ తర్వాత మళ్ళీ హైకోర్టు ఇలా చాలాకాలం కోర్టుల్లో కేసులు వేస్తు జేఏసీ నేతలు కాలం నెట్టుకొచ్చారు. అయితే ఏ కోర్టులోనూ వీళ్ళకి ఊరట లభించలేదు. ప్రతి కోర్టులోనూ పేదలకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చుకోవచ్చనే తీర్పులొచ్చాయి. ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన తీర్పులను జేఏసీ నేతలు తట్టుకోలేకపోతున్నారు.

మొదటేమో కోర్టులో తీర్పు వచ్చేంతవరకు వెయిట్ చేయమని జేఏసీ నేతలు చెప్పారు. తీరా తీర్పు వచ్చిన తర్వాత కోర్టు తీర్పుకు విరుద్ధంగా ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు. అమరావతి జేఏసీ నేతల వాదన ఎలాగుంటుందంటే తమకు అనుకూలంగా తీర్పు వస్తేనేమో న్యాయం గెలిచిందంటారు. వ్యతిరేకంగా వస్తే కోర్టు తీర్పు గురించి మాట్లాడకుండా ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతారు. మొదటినుండి జేఏసీ నేతల వైఖరి ఇలాగే ఉంటోంది. తుళ్ళూరులో బుధవారం జరిగింది కూడా ఇదే.

పోలీసులను ముందుపెట్టి ప్రభుత్వం ఆందోళనలను క్లియర్ చేసుకుని శుక్రవారం ఇళ్ళపట్టాల పంపిణీకి వేదికను రెడీ చేసుకుంటున్నది. సుమారు 54 వేలమందికి మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోకి వచ్చే తొమ్మిది గ్రామాల్లో పట్టాలను పంపిణీ చేయబోతోంది. జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా పేదలు పట్టాలను అందుకోబోతున్నారు. అలాగే ఆర్-5 జోన్ పరిధిలోని నిర్మించిన టిడ్కో ఇళ్ళను కూడా లబ్దిదారులకు జగన్ అందివ్వబోతున్నారు. రాబోయేది ఎన్నికల కాలమే కాబట్టి రాజకీయాలతో సంబంధం లేకుండా రాష్ట్రం మొత్తం మీద టిడ్కో ఇళ్ళను పూర్తిచేసి అందిస్తే లబ్దిదారులు సంతోషిస్తారు.

First Published:  25 May 2023 11:43 AM IST
Next Story