అమరావతి సెంటిమెంట్ ఏమిటో తేలిపోయిందా?
నిలిచిపోయిన అమరావతి పాదయాత్రను జనవరి 8వ తేదీన అమరావతి జేఏసీ కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు పునఃప్రారంభించి 21వ తేదీన శ్రీకాకుళంకు చేరుకున్నారు. అరసవల్లి పుణ్యక్షేత్రంలో పూజలు చేసి తిరుగు ప్రయాణమవుతారని సమాచారం.
ఇంతకాలానికి అమరావతి సెంటిమెంట్ ఏమిటో తేలిపోయింది. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలంటూ జరిగిన పాదయాత్రలో కేవలం ఒకే ఒక్కడు అమరావతి జేఏసీ కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు మాత్రమే శ్రీకాకుళంకు చేరుకున్నారు. దాదాపు రెండున్నర నెలల క్రితం తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గంలో నిలిచిపోయిన పాదయాత్రను గద్దె మాత్రమే కంటిన్యూ చేశారు.
నిలిచిపోయిన పాదయాత్రను జనవరి 8వ తేదీన గద్దె పునఃప్రారంభించి 21వ తేదీన శ్రీకాకుళంకు చేరుకున్నారు. అరసవల్లి పుణ్యక్షేత్రంలో పూజలు చేసి తిరుగు ప్రయాణమవుతారని సమాచారం. విచిత్రం ఏమిటంటే శ్రీకాకుళంలో గద్దెను రిసీవ్ చేసుకున్నది కేవలం ముగ్గురంటే ముగ్గురు టీడీపీ నేతలు మాత్రమే. పాదయాత్రలో కూడా గద్దెతో ఇంకెవ్వరూ పాల్గొనలేదు. ఒకప్పుడు ఎంతో గోలగోలగా ప్రారంభించిన పాదయాత్ర నుండి చివరకు అందరు ఎందుకు జారుకున్నట్లు? ఎందుకంటే అమరావతి పేరుతో మొదలైన పాదయాత్ర రాజకీయ యాత్ర కాబట్టే.
దానికి కోర్టు రూపంలో వచ్చిన ఆంక్షలతో తమ బండారం బయటపడుతుందనే జేఏసీ నేతలు, ఇతరులు పాదయాత్ర వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పాదయాత్రలో పాల్గొనేందుకు 600 మందిని కోర్టు అనుమతించినా ఎవరూ పాదయాత్రలో పాల్గొనలేదు. అంతకుముందు తొడలుకొట్టి, జబ్బలు చరిచిన ఉద్యమకారులెవరూ ఇప్పుడు అడ్రస్ లేరు. అంటే మంత్రులు, వైసీపీ నేతలు మొదటి నుండి ఆరోపిస్తున్నట్లు పాదయాత్రంతా కేవలం చంద్రబాబునాయుడు స్పాన్సర్డ్ యాత్రని తేలిపోయిందా?
ఎప్పుడైతే టీడీపీ, ఎల్లో మీడియా అమరావతి ఉద్యమం గురించి, పాదయాత్ర గురించి పట్టించుకోవటం మానేశాయో అప్పటి నుండే జనాలు అమరావతి గురించి ఆలోచించటం మానేశారు. దాంతో అమరావతి ప్రాంతంలో కూడా అసలు సెంటిమెంట్ అన్నదే లేదని తేలిపోయింది. ఉన్నదంతా వ్యాపారమేనని దానికి కోర్టు ఆంక్షల రూపంలో అడ్డంకులు రావటంతో ఇక డ్రామాలు ఆడి ఉపయోగం లేదని ఉద్యమకారులకు అర్ధమైపోయింది. లేకపోతే గుర్తింపు కార్డులు పెట్టుకుని పాదయాత్రను ఎందుకని పునఃప్రారంభించ లేదు? గద్దె ఒక్కరే పాదయాత్రను ఎందుకు పూర్తి చేశారో ఉద్యమకారులు చెప్పగలరా?