Telugu Global
Andhra Pradesh

ఏపీకి అమరావతే ఏకైక రాజధాని - రాహుల్ గాంధీ

ఆంధ్రప్రదేశ్ కు అమరావతి మాత్రమే రాజధాని అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు కర్నూలు జిల్లాలో సాగుతున్న భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆయనను అమరావతి రైతులు కలిశారు.

ఏపీకి అమరావతే ఏకైక రాజధాని - రాహుల్ గాంధీ
X

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కొనసాగిస్తున్న భారత్ జోడో యాత్ర ఈ రోజు ఏపీలోని కర్నూలు జిల్లాలో సాగుతోంది.ఈ యాత్ర సందర్భంగా అమరావతి రైతులు, పోలవరం నిర్వాసితులు ఆయనను కలిశారు.

ఈ సందర్భంగా పోలవరం రైతులతో ఆయన మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు అండగా ఉంటానన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే పోలవరం నిర్వాసితులకు అర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలుచేస్తామని భరోసా ఇచ్చారు.

మరో వైపు రాహుల్ గాంధీని కలిసిన అమరావతి రైతులు రాజధానిగా అమరావతిని కొనసాగించేలా తాము చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడిన‌ రాహుల్ గాంధీ అమరావతి మాత్రమే ఏపీకి ఏకైక రాజధాని అని అన్నారు. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, తనకు అవకాశం ఉంటే అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొంటానని తెలిపారు.



First Published:  18 Oct 2022 11:43 AM
Next Story