రోజుకు మీకు ఎంతిస్తారు ?-అమరావతి మహిళలతో ఆలయ అర్చకుడు
ఆలయ అర్చకుడు ఉప్పల రమణ.. మీకు కూలీ ఎంత ఇస్తారని ప్రశ్నించారు. రోజుకు రూ.200,లేక 300లా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాంతో అమరావతి మహిళలకు కోపం వచ్చింది.
అమరావతి పాదయాత్ర చేస్తున్న మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే వారిని అధికార పార్టీ నేతలు పెయిడ్ ఆర్టిస్టులు అంటూ దాడి చేస్తున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఒక అర్చకుడి నుంచి ఇదే ప్రశ్న వారికి ఎదురైంది. పెనుగొండలోని కల్యాణ మండలంలో బస చేసిన మహిళలు.. ఉదయమే పక్కనే కన్యకాపరమేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్లారు.
వీరిని చూసిన ఆలయ అర్చకుడు ఉప్పల రమణ.. మీకు కూలీ ఎంత ఇస్తారని ప్రశ్నించారు. రోజుకు రూ.200,లేక 300లా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాంతో అమరావతి మహిళలకు కోపం వచ్చింది. అర్చకుడి తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. మేం 300 తీసుకుని వచ్చే వారిలా కనిపిస్తున్నామా అంటూ అర్చకుడితో వాగ్వాదానికి దిగారు.
ఇంతలో ఆలయంలోని ఇతర సిబ్బంది జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. వివాదం పెద్దదవుతున్న నేపథ్యంలో అర్చకుడిని అక్కడి నుంచి పంపించారు. ఆలయ ఈవో మాత్రం అలాంటిదేమీ జరగలేదని.. అర్చకుడిని పిలిచి మాట్లాడామని.. ఆయన అలా వారిని అవమానించలేదని చెప్పారు.