అమరరాజా అందరి నోళ్ళు మూయించిందా?
చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలంలోని తేనేపల్లిలో రూ. 250 కోట్లతో తమ యూనిట్‌ను విస్తరిస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించారు. పరిశ్రమలను జగన్ ప్రభుత్వం తరిమేస్తున్నదే నిజమైతే, టీడీపీ ఎంపీకి చెందిన అమరరాజా కంపెనీని వేధిస్తున్నదే నిజమైతే మరి కొత్తగా యూనిట్‌ను ఎలా విస్తరిస్తున్నారు?
ప్రముఖ కంపెనీ అమరరాజా అందరి నోళ్ళు మూయించింది. రూ. 9500 కోట్లతో తెలంగాణలో లిథియం అయాన్ బ్యాటరీ ఉత్పత్తి యూనిట్‌ను పెట్టేందుకు అమరరాజా యాజమాన్యం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ విషయాన్ని కంపెనీ స్వయంగా ప్రకటించిన దగ్గర నుండి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియా ఒకటే గోల మొదలుపెట్టేశాయి. పరిశ్రమలను జగన్మోహన్ రెడ్డి తరిమేస్తున్నారంటు నానా రచ్చ చేస్తున్నారు.
సీన్ కట్ చేస్తే చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలంలోని తేనేపల్లిలో రూ. 250 కోట్లతో తమ యూనిట్‌ను విస్తరిస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించారు. పరిశ్రమలను జగన్ ప్రభుత్వం తరిమేస్తున్నదే నిజమైతే, టీడీపీ ఎంపీకి చెందిన అమరరాజా కంపెనీని వేధిస్తున్నదే నిజమైతే మరి కొత్తగా యూనిట్‌ను ఎలా విస్తరిస్తున్నారు? అమరరాజాకు సబ్సిడరీ కంపెనీగా ఉన్న మంగళ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో మెటల్ ఫ్యాబ్రికేషన్స్, ఆటో విడి భాగాలు, బ్యాటరీ విడి భాగాలు, టూల్ వర్క్స్ తదితరాల ఉత్పత్తి జరుగుతుంది.
తేనేపల్లిలోని 2.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త యూనిట్‌ను విస్తరించబోతున్నట్లు జయదేవ్ చెప్పారు. తాజాగా జయదేవ్ ప్రకటనతో అందరి నోళ్ళను మూయించినట్లయ్యింది. తెలంగాణలో యూనిట్ పెట్టాలని అనుకున్నారు కాబట్టి జయదేవ్ అక్కడ పెట్టారంతే. ఇక్కడ గమనించాల్సిందేమంటే వ్యాపారస్తులు 10 రూపాయల పెట్టుబడికి 100 రూపాయల లాభం ఎక్కడ వస్తుందని అనుకుంటే అక్కడకు వెళిపోతారు.
అంతేకానీ జగన్ తరిమేశాడని ఇంకెక్కడకో వెళ్ళి పెట్టుబడులు పెట్టరు. పరిశ్రమలను జగన్ తరిమేస్తున్నదే నిజమైతే టీడీపీ ఎంపీ అయిన జయదేవ్ 2014-19లో చంద్రబాబే అధికారంలో ఉన్నారు కదా మరి ఏపీలో ఎందుకు పెట్టుబడి పెట్టలేదు? ఒకప్పుడు టీడీపీ ఎంపీలే అయిన సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళు ఏపీలో కాకుండా హిమాచల్ ప్రదేశ్‌లో పవర్ ప్లాంట్లు ఎందుకు పెట్టారు? ఎందుకంటే అక్కడ లాభాలొస్తాయని అనుకోబట్టే. ఏదేమైనా జయదేవ్ తాజా ప్రకటనతో అందరి నోళ్ళు మూతబడినట్లేనా?