Telugu Global
Andhra Pradesh

బ్రాహ్మణుల పొట్టగొట్టింది టీడీపీనే.. - ఆల్‌ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్‌ జగన్‌ బ్రాహ్మణులకు అన్నివిధాలా ప్రాధాన్యత ఇచ్చారని ద్రోణంరాజు రవికుమార్‌ అన్నారు.

బ్రాహ్మణుల పొట్టగొట్టింది టీడీపీనే.. - ఆల్‌ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు
X

తెలుగుదేశం పార్టీ పాలనలో బ్రాహ్మణులు తీవ్ర అణచివేతకు గురయ్యారని ఆల్‌ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్‌ తెలిపారు. కరణం వ్యవస్థను కనుమరుగు చేసి బ్రాహ్మణుల పొట్టగొట్టింది టీడీపీయేనని ఆయన ధ్వజమెత్తారు. బ్రాహ్మణులను అర్చకత్వానికి కూడా టీడీపీ దూరం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఏలూరులో నిర్వహించిన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

జగన్‌ హయాంలో అన్ని విధాలా ప్రాధాన్యత

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్‌ జగన్‌ బ్రాహ్మణులకు అన్నివిధాలా ప్రాధాన్యత ఇచ్చారని ద్రోణంరాజు రవికుమార్‌ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన 14 ఏళ్లలో ఏనాడైనా బ్రాహ్మణులకు ఒక్క ఎమ్మెల్యే గానీ, ఎమ్మెల్సీ గానీ, రాజ్యసభ గానీ ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ బ్రాహ్మణులకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా విస్మరించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ హక్కు కల్పించింది జగనే..

బ్రాహ్మణులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా జగన్‌ ఆదుకుంటారనే విశ్వాసం తమకు ఉందని రవికుమార్‌ చెప్పారు. బ్రాహ్మణులను మోసం చేసిన టీడీపీ విధానాలపై రాష్ట్రమంతా పర్యటించి బ్రాహ్మణుల్లో చైతన్యం తీసుకువస్తామని ఆయన తెలిపారు. ఇదే సందర్భంలో అఖిల భారత బ్రాహ్మణ యువత జాతీయ ఉపాధ్యక్షుడు సూరంపూడి కామేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్చకులను, బ్రాహ్మణులను ఉద్ధరించింది జగనే అని చెప్పారు. బాహ్మణులకు జగన్‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.780 కోట్ల లబ్ధి చేకూర్చారన్నారు. అర్చకుల చిరకాల స్వప్నమైన వంశపారంపర్య అర్చకత్వం హక్కును జగనే కల్పించారని గుర్తుచేశారు. దేవాలయాలకు సంబంధించి అర్చకుల స్వాధీనంలో ఉన్న భూముల హక్కులను అర్చకులకే కల్పించి పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు కూడా ఇచ్చి గౌరవించారని ఆయన చెప్పారు.

First Published:  3 May 2024 10:40 AM IST
Next Story