Telugu Global
Andhra Pradesh

ఇక మళ్లీ షూటింగ్‌లకు పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ మరో 20 రోజులు డేట్స్ కేటాయిస్తే ఓజీ చిత్రీకరణ పూర్తవుతుంది. దీనికోసం జూన్ నెలాఖరు నుంచి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇక మళ్లీ షూటింగ్‌లకు పవన్ కళ్యాణ్
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ ముఖానికి రంగేసుకోనున్నారు. ఏపీలో ఎన్నికల కారణంగా ఆయన నటిస్తున్న సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలపాటు ఆయన ప్రచారానికే పరిమితం అయ్యారు. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు ముగిసిపోవడంతో పవన్ మళ్లీ షూటింగ్‌ల బాట పట్టనున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ప్రారంభమై ఐదేళ్లు గడిచినప్పటికీ ఆ సినిమాను పవన్ ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారు. ఈ సినిమాతో పాటు పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఓజీ సినిమా చిత్రీకరణ చాలావరకు పూర్తయింది.

పవన్ కళ్యాణ్ మరో 20 రోజులు డేట్స్ కేటాయిస్తే ఓజీ చిత్రీకరణ పూర్తవుతుంది. దీనికోసం జూన్ నెలాఖరు నుంచి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్ కోసం నిర్మాత దానయ్య ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్‌గా నటిస్తున్నారు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఓజీ సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే నిర్మాత దానయ్య ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో ఓజీ మూవీని పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చారని సమాచారం.

First Published:  18 May 2024 2:25 AM GMT
Next Story