Telugu Global
Andhra Pradesh

పవన్‌ కల్యాణ్‌పై నటి శ్యామల ఆసక్తికర వ్యాఖ్యలు

వంగా గీత గెలుపు ఇప్పటికే ఖాయమైపోయిందని చెప్పారు. వంగా గీత చాలా సీనియర్‌ నాయకురాలని, ఆమెను ఓడించడం ఎవరి వల్లా కాదని స్పష్టం చేశారు.

పవన్‌ కల్యాణ్‌పై నటి శ్యామల ఆసక్తికర వ్యాఖ్యలు
X

పవన్‌ కల్యాణ్‌పై సినీ నటి శ్యామల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ ఇమేజ్‌ ఉన్న స్టార్‌ అయితే.. మిగిలిన సినిమా వాళ్లను తీసుకొచ్చి ఆయన పోటీచేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎందుకు ప్రచారం చేయిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. వంగా గీత గెలుపు ఇప్పటికే ఖాయమైపోయిందని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.

ప్రస్తుత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, వైసీపీ తరపున వంగా గీత అక్కడ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సినీ నటి, వైసీపీ నాయకురాలు అయిన శ్యామల వంగా గీత గెలుపు కోసం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం నటి శ్యామల విలేకరులతో మాట్లాడుతూ.. వంగా గీత గెలుపు ఇప్పటికే ఖాయమైపోయిందని చెప్పారు. వంగా గీత చాలా సీనియర్‌ నాయకురాలని, ఆమెను ఓడించడం ఎవరి వల్లా కాదని స్పష్టం చేశారు. వంగా గీత ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఎదిగారో అందరికీ తెలుసని ఆమె చెప్పారు. ఆమెకు భారీ మెజారిటీ రావాలని తాను కూడా ఆమె తరఫున ప్రచారం చేస్తున్నానని ఈ సందర్భంగా వివరించారు. పిఠాపురం ప్రజలు అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని, ఆ అభివృద్ధి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, వంగా గీత వల్లే సాధ్యమని స్పష్టం చేశారు.

First Published:  3 May 2024 4:18 PM IST
Next Story