మంత్రి రోజా బలం.. పవన్ కల్యాణ్ బలహీనత అదే : నటి కస్తూరి
పవన్ కల్యాణ్ పర్సనల్ లైఫ్ ఆయన సపోర్ట్ చేస్తున్న బీజేపీకి ఏ మాత్రం సూట్ కాదని చెప్పారు. ఆయన రైట్ వింగ్ ఐడియాలజీ ఎలా మద్దతు పలికారో అని ఆసక్తిగా ఉందని కస్తూరి అన్నారు.
మన దేశ రాజకీయాల్లో పర్సనల్ లైఫ్, పబ్లిక్ లైఫ్ అనేది వేర్వేరుగా ఉండదని నటి కస్తూరి అన్నారు. సినిమాలు, రాజకీయాలు, వ్యాపారం, క్రీడలు.. ఏ రంగంలో సెలబ్రిటీలుగా ఉన్నా.. వారి వ్యక్తిగత విషయాలను ప్రజలు తప్పకుండా చూస్తారని ఆమె చెప్పారు. సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు యువతలో బాగా ఫాలోయింగ్ ఉంది. 30 ఏళ్ల లోపు వారంతా పవన్‌కు వీరాభిమానులుగా ఉన్నారు. వారంతా జనసేనకు హార్డ్ కోర్ సపోర్టర్స్. అయితే ఆయన పర్సనల్ లైఫే పెద్ద బలహీనత అని కస్తూరి చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్ పర్సనల్ లైఫ్ ఆయన సపోర్ట్ చేస్తున్న బీజేపీకి ఏ మాత్రం సూట్ కాదని చెప్పారు. ఆయన రైట్ వింగ్ ఐడియాలజీ ఎలా మద్దతు పలికారో అని ఆసక్తిగా ఉందని కస్తూరి అన్నారు. పవన్ కల్యాణ్ పబ్లిక్ లైఫ్ చూసి ఓటేయాలని కోరినా జనాలు వినరని చెప్పారు. తప్పకుండా ఆయన వ్యక్తిగత విషయాలను కూడా దృష్టిలో ఉంచుకుంటారని.. అదే ఆయన బలహీనత అని చెప్పారు.
ఇక ఏపీ మంత్రి రోజా ఎప్పుడూ బోల్డ్‌గా మాట్లాడతారు. ఆమె సినిమాల్లో నటించే సమయంలో కూడా మనసులో ఏమీ దాచుకోకుండా చెప్పేసేవారు. అలాగే ఆమె కుటుంబం పట్ల కూడా బాధ్యతగా ఉంటారు. రోజా మాటలే ఆమెకు బలమని కస్తూరి స్పష్టం చేశారు. వీరిద్దరిలో ఇదే తేడా అని చెప్పుకొచ్చారు.
మక్కల్ నీది మయ్యం పార్టీ తరపున తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయాలని కమల్ హసన్ కోరినట్లు కస్తూరి చెప్పారు. కానీ, కొన్ని కారణాల వల్ల పోటీ చేయలేకపోయానని అన్నారు. కమల్ హాసన్ మిగతా రాజకీయ నాయకులతో పోలిస్తే.. చాలా డిఫరెంట్ అని అన్నారు. రాజకీయాలంటే నమ్మకం లేని వాళ్లు కూడా ఆయన్ని చూసి పాలిటిక్స్‌లోకి వచ్చారని కస్తూరి అన్నారు. ఆయన రాజకీయ విధానం తనను బాగా ఆకట్టుకుందని అన్నారు. అయితే మొదట్లో ఉన్న ఐడియాలజీ ప్రస్తుతం ఆయన దగ్గర లేదని చెప్పుకొచ్చారు.