Telugu Global
Andhra Pradesh

రేవ్‌ పార్టీ ఇష్యూపై తిరుమ‌ల‌లో మీడియాపై న‌టి హేమ ఆగ్ర‌హం

తిరుమ‌ల‌లో హేమ‌ను చూసిన ప‌లువురు జనాలు ఆమెతో సెల్ఫీలు తీసుకున్నారు. మ‌రోవైపు అక్క‌డే ఉన్న మీడియాతో కూడా హేమ మాట్లాడింది.

రేవ్‌ పార్టీ ఇష్యూపై తిరుమ‌ల‌లో మీడియాపై న‌టి హేమ ఆగ్ర‌హం
X

రెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్న నటి హేమ కొద్ది రోజుల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొని న్యూస్ హెడ్ లైన్స్ లో నిలిచిన సంగతి తెలిసిందే. పార్టీలో పాల్గొన్నా కూడా తాను హైద‌రాబాద్ లోనే ఉన్నానంటూ వీడియోలు వ‌దిలి త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు హేమ ప్ర‌య‌త్నించింది. కానీ బెంగ‌ళూరు పోలీసులు ఆమె బండారం బ‌య‌ట‌పెట్టారు.

ప‌క్కా ఆధారాలతో రేవ్ పార్టీ కేసులో హేమను అరెస్ట్ చేశారు. అలాగే ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) హేమ ప్రాథ‌మిక స‌భ్య‌త్వాన్ని కూడా రుద్దు చేసింది. అయితే ఇంత జరిగినా కూడా హేమలో మార్పు రాలేదు. చింత చిచ్చినా పులుపు చావ‌లేద‌న్న‌ట్లుగా ఆమె తీరు ఉంది. ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన హేమా తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.

తిరుమ‌ల‌లో హేమ‌ను చూసిన ప‌లువురు జనాలు ఆమెతో సెల్ఫీలు తీసుకున్నారు. మ‌రోవైపు అక్క‌డే ఉన్న మీడియాతో కూడా హేమ మాట్లాడింది. నేను ఇక్కడే పుట్టానని.. ఎప్పుడు తిరుమ‌ల‌కు వచ్చినా నా పుట్టిల్లుకి వ‌చ్చిన భావ‌న క‌లుగుతుంద‌ని చెప్పుకొచ్చింది. ఈ క్ర‌మంలోనే ఓ రిపోర్ట‌ర్ రేవ్ పార్టీ ఇష్యూ గురించి ప్ర‌శ్నించాడు. అందుకు హేమ బ‌దులిస్తూ.. ఏమో రేవ్ పార్టీ పై అనేక కథనాలు మీరే రాశారు.. మీకే తెలియాలి అంటూ మీడియాపై సెటైర్లు పేల్చింది. దీంతో హేమ కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

First Published:  28 Jun 2024 3:04 PM IST
Next Story