Telugu Global
Andhra Pradesh

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న మనోజ్, మౌనికా రెడ్డి

మీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలొస్తున్నాయని ప్రశ్నించగా.. మంచు మనోజ్ వాటిని ఖండించలేదు. ప్రస్తుతానికి నో కామెంట్ అనేశారు. సమయం వచ్చినప్పుడు పెళ్లిపై పూర్తి వివరాలు తెలియజేస్తానని చెప్పారు.

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న మనోజ్, మౌనికా రెడ్డి
X

భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె మౌనికా రెడ్డి, నటుడు మంచు మనోజ్ వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ సీతాఫల్ మండి వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలో వీరద్దరూ కలిసి పూజలు చేశారు. వారిని చూసిన మీడియాప్రతినిధులు మీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలొస్తున్నాయని ప్రశ్నించగా.. మంచు మనోజ్ వాటిని ఖండించలేదు. ప్రస్తుతానికి నో కామెంట్ అనేశారు. సమయం వచ్చినప్పుడు పెళ్లిపై పూర్తి వివరాలు తెలియజేస్తానని చెప్పారు.

మౌనికా రెడ్డితో కలిసి పూజలు చేయడం, పెళ్లి వార్తను ఖండించకపోగా త్వరలోనే అన్ని విషయాలు చెబుతానని వెల్లడించడంతో వారిద్దరి వివాహం ఖాయమన్న చర్చ నడుస్తోంది. మంచు, భూమా కుటుంబాల మధ్య తొలి నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. మంచు లక్ష్మీ, అఖిల ప్రియ ఇద్దరు మంచి స్నేహితులు. మౌనిక తొలి వివాహానికి మంచు మనోజ్ కూడా హాజరయ్యారు.

తొలుత మౌనికకు బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త కుమారుడితో వివాహం జరిగింది. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. మంచు మనోజ్‌కు గతంలోనే ప్రణతిరెడ్డి అనే అమ్మాయితో వివాహం అయింది. ఆమెకు ఇతడు విడాకులు ఇచ్చారు. అటు మౌనిక, ఇటు మ‌నోజ్ ఇద్దరూ ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. కుటుంబానికి సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఇటీవల ఇద్దరు కలిసి తిరుగుతున్నారు. త్వరలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

భూమా అఖిల ప్రియ.. మౌనికారెడ్డికి సొంత అక్క. భూమా అఖిల ప్రియ కూడా తొలుత వైఎస్‌ బావమరిది రవీంద్రారెడ్డి కుమారుడిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అతడికి ఆమె విడాకులు ఇచ్చింది. మాజీ డీజీపీ సాంబశివరావు కుమార్తె మాజీ భర్త అయిన భార్గవ్‌ రామ్‌ను భూమా అఖిలప్రియ రెండో వివాహం చేసుకున్నారు. సాంబశివరావు కుమార్తెకు భార్గవ్ రామ్ విడాకులు ఇచ్చారు. అఖిల ప్రియతో వివాహం తర్వాత భార్గవ్ రామ్‌... ఆళ్లగడ్డ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. పలు వివాదాల్లో, దాడుల్లో అతడిపై కేసులు నమోదు అయ్యాయి.

First Published:  5 Sept 2022 11:15 AM IST
Next Story