Telugu Global
Andhra Pradesh

యువతిపై యాసిడ్‌ దాడి.. నిందితుడిపై కఠిన చర్యలకు సీఎం ఆదేశం

బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు తీసుకోవాలన్న చంద్రబాబు

యువతిపై యాసిడ్‌ దాడి.. నిందితుడిపై కఠిన చర్యలకు సీఎం ఆదేశం
X

అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్‌ దాడి ఘటనను సీఎం చంద్రబాబు ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత యువతి, ఆమె కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. గుర్రంకొండ మండలం ప్యారంపల్లెలో గణేష్‌ అనే యువకుడు ఓ యువతి తలపై కత్తితో గాయపరిచి ముఖంపై యాసిడ్‌ పోశాడు. గాయాలపాలైన బాధితురాలని మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏప్రిల్‌ 29న ఆమె పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. నిందిడిని మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందినవాడిగా గుర్తించారు.


First Published:  14 Feb 2025 1:50 PM IST
Next Story