Telugu Global
Andhra Pradesh

ఏడాది కాదు, 8 నెలలే.. అచ్చెన్న డిక్లరేషన్

జగనన్న స్టిక్కర్లన్నిటినీ పీకేస్తామంటున్నారు అచ్చెన్నాయుడు. అనుమతి లేకుండా ఇళ్లకు స్టిక్కర్లు అతికిస్తే తిప్పి కొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.

ఏడాది కాదు, 8 నెలలే.. అచ్చెన్న డిక్లరేషన్
X

ఏపీలో మరో ఏడాదిలో ఎన్నికలొస్తాయని, అందరూ సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేల రివ్యూ మీటింగ్ లో పిలుపునిచ్చారు సీఎం జగన్. ముందస్తు ముచ్చటే లేదన్నారు. అయితే జగన్ ప్రభుత్వానికి ఏడాది టైమ్ లేదని, కేవలం 8 నెలలు మాత్రమే ఉందంటున్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. 8 నెలల తర్వాత 160 సీట్లతో ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ప్రభుత్వంపై ఉత్తరాంధ్ర నుంచే తిరుగుబాటు ప్రారంభమైందని అన్నారు.

స్టిక్కర్లు పీకి పారేస్తాం..

మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమంతో మరోసారి వైసీపీ జనంలోకి వెళ్లబోతోంది. ఈ క్రమంలో ప్రతి ఇంటిపై జగనన్నే మా భవిష్యత్తు అనే స్టిక్కర్ అంటించబోతున్నారు, ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ కి కూడా ఈ స్టిక్కర్ వేస్తారు. జగన్ కి జై కొట్టి అనుమతించిన వారి ఇళ్లకే వీటిని అతికించాలని వైసీపీ పెద్దలు చెబుతున్నా.. మాకు మీ స్టిక్కర్ వద్దు అంటే ఏమవుతుందో జనంకి తెలుసు. గతంలో కూడా ఇలాగే గడప గడపలో రచ్చలు జరిగి మా పథకాలు మీకెందుకు అని నేతలు ప్రశ్నించే వరకు వెళ్లారు. అందుకే ఈసారి ఏపీలోని అన్ని ఇళ్లకూ, ముఖ్యంగా సంక్షేమ పథకాలు అందుకునే ప్రతి ఇంటికీ జగన్ స్టిక్కర్ పడాల్సిందే. అయితే ఈ స్టిక్కర్లన్నిటినీ పీకేస్తామంటున్నారు అచ్చెన్నాయుడు. అనుమతి లేకుండా ఇళ్లకు జగనన్న స్టిక్కర్లు అతికిస్తే తిప్పి కొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.

అంతు తేలుస్తాం..

ప్రభుత్వ సిబ్బంది కొంతమంది అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు అచ్చెన్నాయుడు. ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటున్న వాలంటీర్లు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. కేంద్ర సర్వీసులు నుంచి వచ్చిన అధికారుల చర్యలన్నీ గుర్తు పెట్టుకుంటున్నామని వాళ్లెవరూ ప్రభుత్వం మారాక తప్పించుకోలేరని హెచ్చరించారు.

First Published:  5 April 2023 9:10 PM IST
Next Story