Telugu Global
Andhra Pradesh

కాకినాడ: ఆయిల్ కంపెనీలో ప్రమాదం -7 గురు కార్మికులు మృతి

ఈ రోజు ఉదయం ఆయిల్ టాంకర్ ను శుభ్రం చేయడానికి ఏడుగురు కార్మికులు ఆయిల్ టాంకర్ లోకి దిగారు. కొంతసేపటికే ట్యాంకర్ లోపలి నుంచి అరుపులు వినిపించాయని తాము వెళ్ళి చూడగా ఏడుగురు కార్మికులు స్పృహతప్పి ఉన్నారని తోటి కార్మికులు తెలిపారు. అయితే వాళ్ళ‌ను బైటికి తీసే లోపే ఆ ఏడుగురు మరణించారు.

కాకినాడ: ఆయిల్ కంపెనీలో ప్రమాదం -7 గురు కార్మికులు మృతి
X

కాకినాడ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాద‍ంలో 7గురు కార్మికులు మరణించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం, జీ.రాగంపేట లో నిర్మాణంలో ఉన్న అంబటి ఆయిల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది.

ఈ రోజు ఉదయం ఆయిల్ టాంకర్ ను శుభ్రం చేయడానికి ఏడుగురు కార్మికులు అందులోకి దిగారు. కొంతసేపటికే ట్యాంకర్ లోపలి నుంచి అరుపులు వినిపించాయని తాము వెళ్ళి చూడగా ఏడుగురు కార్మికులు స్పృహతప్పి ఉన్నారని తోటి కార్మికులు తెలిపారు. అయితే వాళ్ళ‌ను బైటికి తీసే లోపే ఆ ఏడుగురు మరణించారు.

చనిపోయిన వారిలో ఐదుగురు పాడేరుకు చెందినవారుగా, మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరకు చెందినవారుగా గుర్తించారు.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అంబటి ఆయిల్ ఫ్యాక్టరీకి చేరుకున్నారు. కార్మికులు చనిపోవడానికి కారణమేంటని విచారిస్తున్నారు. ఊపిరాడక చనిపోయినట్టు తెలుస్తున్నప్పటికీ అసలు ట్యాంకర్ లోపలి కి దిగినప్పుడు ఎలాంటి రక్షణ పరికరాలు లేకపోవడంపై యాజమాన్యంపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

First Published:  9 Feb 2023 10:36 AM IST
Next Story