తహసీల్దార్ ఫిర్యాదుతో పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు
బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామంలో రెవెన్యూ అధికారులు వేసిన కొలతలను, హద్దులను పరిటాల శ్రీరామ్‌తో కలిసి కొందరు తొలగించారని తహసీల్దార్ యుగేశ్వరి దేవి ఫిర్యాదు చేశారు. దాంతో ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు శ్రీరామ్‌పై కేసు నమోదు చేశారు.
టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామంలో రెవెన్యూ అధికారులు వేసిన కొలతలను, హద్దులను పరిటాల శ్రీరామ్‌తో కలిసి కొందరు తొలగించారని తహసీల్దార్ యుగేశ్వరి దేవి ఫిర్యాదు చేశారు. దాంతో ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు శ్రీరామ్‌పై కేసు నమోదు చేశారు.
పరిటాల శ్రీరామ్‌తో పాటు మరో 23 మందిపై కూడా 447, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు బత్తలపల్లి పోలీసులు స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ధర్మవరం నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు ఇటీవల నారా లోకేశ్ కూడా యువగళం పాదయాత్రలో అధికారికంగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.
వాస్తవానికి రాప్తాడుతో పాటు ధర్మవరం నియోజకవర్గంలోనూ పరిటాల ఫ్యామిలీకి గట్టి పట్టు ఉంది. ఇప్పటికే ధర్మవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్న పరిటాల శ్రీరామ్ టీడీపీ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. అలానే స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై కూడా ఘాటుగా విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో ఉంటున్నారు. ఇద్దరి మధ్య రాబోవు ఎన్నికల్లో గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది.