షర్మిలకు భారీ షాక్.. సామాన్యుడి నుంచి చేదు అనుభవం
వైఎస్సార్ కుటుంబాన్ని వేధించిన కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకున్నారని అతను నిలదీశాడు. జగన్‌ను అన్యాయంగా జైల్లో పెడితే.. అప్పుడు మీరు పాదయాత్ర చేశారని, అప్పుడున్న నిజాయితీ ఇప్పుడెందుకు లేదని అన్నాడు.
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు చేదు అనుభవం ఎదురైంది. నర్సీపట్నం నియోజకవర్గంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఓ సామాన్యుడి నుంచి ఎదురైన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో వైఎస్ షర్మిలకు దిక్కు తోచలేదు. ఒక్కసారిగా ఆమె నిశ్చేష్టురాలు అయ్యారు. గతంలో అన్న జగన్ వెంట నడిచి ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ చేరడానికి కారణం ఏమిటని అతను ప్రశ్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
వైఎస్సార్ కుటుంబాన్ని వేధించిన కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకున్నారని అతను నిలదీశాడు. జగన్‌ను అన్యాయంగా జైల్లో పెడితే.. అప్పుడు మీరు పాదయాత్ర చేశారని, అప్పుడున్న నిజాయితీ ఇప్పుడెందుకు లేదని అన్నాడు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబాన్ని వేధించిందని, వైఎస్సార్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిందని, జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టిందని, ఆ సమయంలో మీరు పాదయాత్ర చేశారని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ కుటుంబానికి అండగా నిలబడ్డారని, ఆ సమయంలో మీరు చేసిన పాదయాత్రలో మీతో నడిచామని అతను అన్నాడు.
ఇప్పుడు మళ్లీ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారని, కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటున్నారని, అందుకు నేను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలని ఆ వ్యక్తి కోరాడు. వైఎస్ జగన్ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, పింఛన్లు మొదలుకొని ప్రతీ పథకం అర్హులైన పేదలందరికీ అందుతోందని అతను షర్మిలకు వివరించాడు.