Telugu Global
Andhra Pradesh

చిరుత దాడిలో బాలిక మృతి - అలిపిరి కాలిన‌డ‌క మార్గంలో ఘ‌ట‌న‌

ఇంకో గంట సమయం ప్రయాణిస్తే తిరుమలకు చేరుకునేవారు. అదే స‌మ‌యంలో కుటుంబ స‌భ్యుల కంటే ముందుగా న‌డిచి వెళుతున్న చిన్నారి ల‌క్షితపై చిరుత పులి ఒక్క‌సారిగా దాడి చేసింది.

చిరుత దాడిలో బాలిక మృతి  - అలిపిరి కాలిన‌డ‌క మార్గంలో ఘ‌ట‌న‌
X

అలిపిరి కాలిన‌డ‌క మార్గంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిరుత పులి దాడి చేయ‌డంతో ఆరేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. శుక్ర‌వారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మ‌రో గంట ప్ర‌యాణిస్తే తిరుమ‌ల‌కు చేరుకుంటామ‌నుకునే స‌మ‌యంలో ముందుగా వెళుతున్న బాలిక‌పై చిరుత పులి ఒక్క‌సారిగా దాడి చేసింది. ఈ ఘ‌ట‌న‌తో కుటుంబ స‌భ్యులు ఒక్కసారిగా నిర్ఘాంత‌పోయారు. తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌తో వారు ఒక్క‌సారిగా కేక‌లు వేయ‌డంతో చిరుత బాలిక‌ను అడ‌విలోకి ఈడ్చుకెళ్లింది.

నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెంకు చెందిన కుటుంబం శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో కాలినడకన శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు. ఇంకో గంట సమయం ప్రయాణిస్తే తిరుమలకు చేరుకునేవారు. అదే స‌మ‌యంలో కుటుంబ స‌భ్యుల కంటే ముందుగా న‌డిచి వెళుతున్న చిన్నారి ల‌క్షితపై చిరుత పులి ఒక్క‌సారిగా దాడి చేసింది.

బాలిక‌ను చిరుత‌ అడ‌విలోకి లాక్కెళ్ల‌డంతో త‌ల్లిదండ్రులు వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. రాత్రి స‌మ‌యం కావ‌డంతో గాలింపు చేప‌ట్టేందుకు వీలుప‌డ‌లేదు. ఉద‌యం వేళ గాలింపు చేప‌ట్టిన పోలీసులు.. ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యానికి కొద్ది దూరంలో బాలిక మృత‌దేహం క‌నిపించింది. అప్ప‌టికే చిరుత బాలిక మృత‌దేహాన్ని స‌గం తినేసిన‌ట్టు గుర్తించారు. దీంతో త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు.

First Published:  12 Aug 2023 11:04 AM IST
Next Story