పూనకాలు లోడింగ్.. సోషల్ మీడియాలో వైసీపీ ట్రెండింగ్
వైసీపీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టేలా చూస్తున్నారు. దీంతో సోమవారం సాయంత్రం నుంచి #YSRCPAgain2024 అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది.
వైసీపీ ఘన విజయానికి సరిగ్గా నేటితో నాలుగేళ్లు. మరి సెలబ్రేషన్లు మామూలుగా ఉంటాయా, అందుకే ఓ రేంజ్ లో పండగ చేసుకుంటున్నారు వైసీపీ నేతలు, ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు. నాలుగేళ్ల క్రితం వైసీపీ గెలుపుకంటే ఎక్కువగా ఇప్పుడు సంబరాలు జరుగుతున్నాయి. గెలిచిన ప్రతి ఎమ్మెల్యే, ఓట్ల లెక్కింపు రోజు ఏం జరిగిందనే సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు. జగనన్న ఘన విజయానికి నాలుగేళ్లు అంటూ పోస్టింగ్ లు పెడుతున్నారు.
YSRCP's vision for a developed and prosperous Andhra Pradesh resonates with the aspirations of every citizen. Together, let's march towards a glorious 2024 victory!! #YSRCPAgain2024 pic.twitter.com/eZQGmAc60e
— Roja Selvamani (@RojaSelvamaniRK) May 23, 2023
#YSRCPAgain2024
2024లో కూడా అలాంటి విజయమే పునరావృతం కావాలంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు. #YSRCPAgain2024 అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండిగ్ లోకి తెచ్చారు. అప్పట్లో సీఎం జగన్ ప్రసంగాలు, పత్రికల్లో వచ్చిన కథనాలు, ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో జగన్ విజయం గురించి రాసిన కథనాలను హైలెట్ చేస్తూ తిరిగి పోస్ట్ చేస్తున్నారు.
This day, 4 Years ago….
— YSR Congress Party (@YSRCParty) May 23, 2023
History will repeat again! #YSRCPAgain2024@abntelugutv pic.twitter.com/fwxQjM0awX
మళ్లీ మేమే..
వచ్చే దఫా కూడా మళ్లీ వైసీపీదే అధికారం అంటున్నారు నేతలు. వైనాట్ 175 అని ధీమాగా చెబుతున్నారు. జగన్ లెక్క తప్పదంటున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాది టైమ్ ఉండగా.. ఇప్పటినుంచే సోషల్ మీడియాలో హల్ చల్ మొదలు పెట్టారు. నాలుగేళ్ళ పాలనలో వైసీపీ ప్రవేశ పెట్టిన పథకాలను మరోసారి గుర్తు చేస్తున్నారు. జగన్ పై ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలను కూడా సోషల్ మీడియా వేదికగా బహిరంగ పరుస్తున్నారు. వైసీపీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టేలా చూస్తున్నారు. దీంతో సోమవారం సాయంత్రం నుంచి #YSRCPAgain2024 అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది.
ఊపు వచ్చేసింది..
నిన్నటి వరకూ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉండగా.. నిన్న సాయంత్రం నుంచి వైసీపీ పోస్టింగ్ లు హైలెట్ అయ్యాయి. ఈరోజు కూడా వైసీపీ పేరుతో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా పోస్ట్ లు సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి.